AM Ghazanfar Ruled out: ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జరిగిన మెగా వేలంలో ఏకంగా రూ.4.8 కోట్లు పెట్టి కొన్న ప్లేయర్.. రానున్న సీజన్‌కు దూరం అయ్యాడు. అతను మరెవరో కాదు.. ఆఫ్ఘనిస్థాన్ మిస్టరీ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఏఎమ్ ఘజన్‌ఫర్. ఐపీఎల్ 2024 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది సీజన్‌లో మాత్రం సత్తా చాటాలని బలంగా ఫిక్స్ అయింది. అందుకోసం.. స్టార్ ప్లేయర్లకు భారీ మొత్తం ఇచ్చి రిటేన్ చేసుకొని, మెగా వేలంలో మంచి స్ట్రాటజీతో సూపర్ టాలెంటెడ్ ప్లేయర్లను దక్కించుకుంది. అందులో ఘజన్‌ఫర్ ఒకడు. అతనిపై ముంబై ఎన్నో ఆశలు పెట్టుకొంది. పైగా ఘజన్‌ఫర్‌కు కూడా ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కడం ఇదే తొలిసారి. కానీ, పాపం సీజన్ ఆరంభం కాకుండానే అతను గాయంతో ఐపీఎల్‌కు దూరం అయ్యాడు.
వెన్ను గాయంతో అతను ఐపీఎల్‌తో పాటు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం అయ్యాడు. ఆఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్‌ఉర్ రెహమాన్ స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఘజన్‌ఫర్.. టోర్నీ ఆరంభం కాకుండానే దూరం కావడం బ్యాడ్ లక్ అని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. ముజీబ్ చాలా కాలంగా ఆఫ్ఠాన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ను పూర్తిగా ఆడాడు. దీంతో అతన్ని పక్కనపెట్టిన ఆఫ్ఠాన్ క్రికెట్ బోర్డు అతని స్థానంలో ఘజన్‌ఫర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసింది. ఇప్పుడు అతను గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతని స్థానంలో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నంగేయాలియా ఖరోటేను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లోకి తీసుకుంది ఏసీబీ(ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు). ఖరోటేతో కలిపి.. ఆఫ్ఠాన్ స్క్వాడ్‌లో మొత్తం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, నూర్ అహ్మెద్, మొహమ్మద్ నబీ ఇప్పటికే టీమ్‌లో ఉన్నారు. కాగా ఘజన్‌ఫర్‌కు గాయం కావడం అటూ ఆఫ్ఘాన్ జట్టుతో పాటు, ముంబై ఇండియన్స్‌కు కూడా భారీ ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఘజన్ఫర్ ఇంజ్యూరీ అప్డేట్
🚨 INJURY UPDATE 🚨
Afghanistan’s young spin-bowling sensation, AM Ghazanfar, has been ruled retired of the ICC Champions Trophy owed to a fracture successful the L4 vertebra, specifically successful the near pars interarticularis. He sustained the wounded during Afghanistan’s precocious held tour… pic.twitter.com/g0ALWe7HVe
— Afghanistan Cricket Board (@ACBofficials) February 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆఫ్ఘనిస్థాన్ స్క్వాడ్: హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహెమత్ షా(వైస్ కెప్టెన్), రహమనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇక్రమ్ అలిఖిల్(వికెట్ కీపర్), సిదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటే, నూర్ అహ్మద్, ఫజల్‌హక్ ఫరూఖీ, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..