కోనసీమ జిల్లా కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకింది. కానూరు గ్రామ పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీనితో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..
Chicken
Pvv Satyanarayana | Edited By: Ravi Kiran
Updated on: Feb 10, 2025 | 8:01 PM
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో సేకరించిన శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చినట్లు పూణే ల్యాబ్‌లో నిర్ధారణ అయిందని జిల్లా అధికారులు వెల్లడించారు. ల్యాబ్ రిపోర్ట్ రావడంతో రాజమండ్రి కలెక్టరేట్‌లో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కానూరు గ్రామం పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్, పది కిలోమీటర్లు సర్వైలెన్స్ జోన్‌గా ప్రకటించి.. ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. దీనిపై పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
కొద్దిరోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పౌల్ట్రీల్లో ప్రతిరోజూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడం బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ర్యాపిడ్ టీమ్‌లను నియమించారు కలెక్టర్. చనిపోయిన కోళ్లను సురక్షిత ప్రదేశాల్లో ఖననం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు..ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలనీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు జారీ చేశారు. ఏమైనా అనుమానాలు ఉంటే రాజమండ్రి కలెక్టరేట్ లో కమెండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తో 9542908025 ను సంప్రదించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి