కోనసీమలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఇంటిని కాజేస్తారోనని స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. తాజాగా అల్లవరం మండలంలో దొంగలు ఆలయంలో చోరీ చేశారు. సీసీటీవీలో ఆ విజువల్స్ రికార్డు అయ్యాయి. మరి అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. అదేంటంటే
కోనసీమ జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రులో దొంగలు హల్‌చల్ చేశారు. సామంతకుర్రులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయంలోకి ఎంటర్ అవుతూనే ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం నగలు దోచేశారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియో ఆధారంగా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. కాగా, ఈ మధ్య జిల్లాల దొంగల బెడద ఎక్కువైందని అక్కడి జిల్లా వాసులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి