కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ‘క్రేజీ బాయ్’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్..
Updated on: Feb 10, 2025 | 8:40 PM
కర్ణాటకలోని తుమకూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. బుల్లితెర నుంచి తన కెరీర్ నుంచి ప్రారంభించింది. పలు డ్యాన్స్ షోలలో పాల్గొని.. 2014లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈమె అక్క అనూష రంగనాథ్ కూడా కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ‘క్రేజీ బాయ్’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్..
1 / 5
‘రాంబో2’ మూవీతో తన తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ‘మదగజ’, ‘అవతార పురుష’, ‘గరుడ’ లాంటి చిత్రాలతో అషికా రంగనాధ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు స్టార్ హీరోల సినిమాల్లోనూ క్యామియో రోల్స్‌లో అలరించింది ఈ అందాల భామ.
2 / 5
మరోవైపు ‘పట్టాత్తు ఆర్సన్’ అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆషికా.. గత ఏడాది తెలుగు ప్రేక్షకులను ‘అమిగోస్’ చిత్రంతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత విజయం సాధించకపోయినా.. అషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
3 / 5
ఆ తర్వాత ‘నా సామి రంగా’ చిత్రంలో నాగార్జున సరసన యాక్ట్ చేసి.. పల్లెటూరి అమ్మాయిలా అందరినీ అలరించింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘విశ్వంభర’లో నటిస్తోంది. అటు కన్నడం, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది అషికా.
4 / 5
ఇక సినిమాలతో పాటు ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు.. షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ వయ్యారి తన ఫోజులతో కవ్విస్తుంది.
5 / 5