భారతదేశ ఆటోమొబైల్ రంగం 2030 నాటికి రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల గూగుల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)కు సంబంధించిన థింక్ మొబిలిటీ నివేదికలో 2030 నాటికి మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేశారు. ముఖ్యంగా అదే స్థాయిలో ఈవీ మార్కెట్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. భారతదేశ ఆటోమొబైల్ రంగం 2030 నాటికి రెట్టింపు అవుతుంది. ఆటో రంగ మార్కెట్ క్యాప్ 2030 నాటికి 600 బిలియన్ల డాలర్లకు మించి ఉంటుంది. ఎలక్ట్రిక్, షేర్డ్, కనెక్టెడ్ మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న ఆదాయ వనరుల కారణంగా 100 బిలియన్ల డాలర్ల వ్యాపారం పెరుగుతుందని కూడా పేర్కొంది. ఈ నివేదికపై బీసీ మేనేజింగ్ డైరెక్టర్ నటరాజన్ శంకర్ మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా ఉందన్నారు. రాబోయే కొన్నేళ్లలో భారత్‌లో మరిన్ని మార్పులు రానున్నాయి. ఈవీ డిజిటల్, ఏఐ రంగాల్లో ప్రపంచ ఆవిష్కరణ భారత్‌లో ఈవీ రంగ వృద్ధికి కారణమవుతాయని పేర్కొన్నారు.
నివేదిక ప్రకారం దేశ ఆటో పరిశ్రమ వృద్ధికి ఈవీ చాలా దోహదపడింది. ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (ఈ4డబ్ల్యూ), ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ (ఈ2డబ్ల్యూ) మధ్య విభిన్నమైన ప్రాధాన్యతలతో ప్రతి ముగ్గురు కొనుగోలుదారులలో ఒకరు ఈవీ వాహనాలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ4డబ్ల్యూ కొనుగోలుదారులు అధిక సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తారు. అదే సమయంలో ఈ2డబ్ల్యూ కస్టమర్‌లు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ జానకిరామన్ ప్రజల అవసరాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కంపెనీలు డిమాండ్‌కు అనుగుణంగా కార్లను తయారు చేయాల్సి ఉంటుందన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కంపెనీలు వాహనాలను యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని సూచిస్తున్నారు. గూగుల్ ఇండియా ఓమ్నీ-ఛానల్ బిజినెస్ డైరెక్టర్ భాస్కర్ రమేష్ ఈ నివేదికపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశ ఆటో మొబైల్ పరిశ్రమలో పెనుమార్పు వస్తోందని ఇది మొత్తం పర్యావరణ వ్యవస్థను పునర్నిర్వచించిందని అన్నారు. జెన్ జెడ్, మహిళల నేతృత్వంలో డిజిటల్ షాపింగ్ పెరుగుతుందని, దాంతో పాటు లాభాలను ఆర్జించడానికి కస్టమర్ ప్రాధాన్యతలను మార్చడానికి కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి