భారతదేశంలో ఫెర్రాటో డిఫై 22 పేరిట మరో కొత్త స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పో – 2025లో లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99 వేల 999 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. షాంపైన్ క్రీమ్, కోస్టల్ ఐవరీ, బ్లాక్, యూనిటీ వైట్, డోవ్ గ్రే, మ్యాట్ గ్రీన్, బ్లాక్ ఫైర్ వంటి ఏడు రంగుల్లో ఈ స్కూటర్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇదే ధరల్లో ఈ స్కూటర్ ఓలా ఎస్1ఎక్స్, బజాజ్ చేతక్ వంటి స్కూటర్లతో నేరుగా పోటీపడుతుంది. ఓలా స్కూటర్ ధర రూ. 91,999 కాగా, బజాజ్ చేతక్ 2903 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95, 998 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
ఫెర్రాటో డిఫై 22 స్కూటర్‌కు సంబంధించిన టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలో మీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కంపెనీ ఈ స్కూటర్‌లో ఐపీ 67 రేటెడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్‌తో ఐపీ 65 రేటింగ్‌తో క్లైమేట్ ప్రూఫ్ ఛార్జర్‌తో వస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ వంటి మూడు రైడింగ్ మోడ్‌లతో విడుదలైన ఈ స్కూటర్‌లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందిస్తుంది.
ఈ స్కూటర్‌లో మ్యూజిక్ ఫీచర్‌తో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ స్పీడోమీటర్ ఉంది. అంటే కారులో ప్రయాణిస్తున్నప్పుడు సంగీతాన్ని ఎలా ఆస్వాదిస్తారో అదే విధంగా ఈ స్కూటర్‌పై ప్రయాణిస్తున్నప్పుడు కూడా సంగీతాన్ని వినవచ్చు. భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ స్కూటర్‌లో కాంబి డిస్క్ బ్రేక్ సిస్టమ్‌ను అందించింది. ముందు భాగంలో 220 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 180 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ స్కూటర్‌లో లగేజీని ఉంచడానికి 25 లీటర్ల బూట్ స్పేస్‌తో ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి