బాలయ్య క్రేజ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిందని కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. మరికొందరేమో ఆ యువకుడు చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఓటు విలువ తెలిస్తే ఇలా చేయరు అని.. ఇలా చేసిన వారిపై, ఆ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఎగతాళి చేశారని నాలుగు కేసులు పెట్టి ఆ పౌరసత్వం తీసేస్తే.. అప్పుడు ఓటు విలువ తెలుస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని సగర్వంగా సొంతం చేసుకున్నారు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్. సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ.. డెమోక్రట్లను కంగుతినిపించారు. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నెట్టింట మీమ్స్ వెల్లువెత్తాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌ను విమర్శించేలా ఫన్నీ పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే Where is Kamala? అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫన్నీ మీమ్స్ లో.. ఈ కమలా హారిస్ ఎక్కడబ్బా..! అని జో బైడెన్ చూస్తున్నట్లుగా.. ఓ మై గాడ్.. బహుశా నేను ట్రంప్‌నకు ఓటేశానేమో అని బైడెన్ అంటున్నట్లుగా…హారిస్ ఎలక్షన్ నైట్‌వాచ్ కార్యక్రమానికి బైడెన్ హాజరుకాకపోవడంతో.. ఆ సమయంలో ఆయన ట్రంప్‌తో ఎస్టేట్‌లో ఉండి ఉంటారంటూ మీమర్స్ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.