Bank Account: మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా? వెంటనే ఈ పని చేయండి.. లేకుంటే అకౌంట్‌ క్లోజ్‌!

2 hours ago 1

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB బ్యాంక్)లో కూడా ఖాతా ఉంటే ఈ వార్త మీ కోసమే. పీఎన్‌బీ తన ఖాతాదారులకు ఓ హెచ్చరికను జారీ చేసింది. వారి ఖాతాలో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ లావాదేవీలు జరగకుండా జీరో బ్యాలెన్స్‌తో కొనసాగుతున్నాయి. అటువంటి ఖాతాలు మూసివేసేందుకు రంగం సిద్ధమైంది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు. ఈ సందర్భంగా సదరు బ్యాంకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం అందించింది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా 3 సంవత్సరాలుగా మీ పీఎన్‌బీ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు చేయకుంటే, వీలైనంత త్వరగా ఈ పనిని చేయండి. అలాంటి ఖాతాలపై లావాదేవీలు చేసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకు ఇంకా ఏం చెప్పిందో తెలుసుకుందాం.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తన ట్విట్టర్ (X) ఖాతాలో హెచ్చరికను జారీ ప్రకారం.. కస్టమర్ ఖాతాలో రెండేళ్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరగకపోతే, అప్పుడు ఖాతా పనిచేయదు. మీ ఖాతాలో లావాదేవీలు జరిగేలా చూసుకోండి. తద్వారా అది పనికిరాకుండా ఉంటుంది. ఇంతకు ముందు కూడా బ్యాంకు ఖాతాదారులను పలుమార్లు అప్రమత్తం చేసింది. అయితే, ఈసారి బ్యాంకు ఎలాంటి గడువు విధించలేదు. అలాంటి ఖాతాలను ఏకంగా మూసివేసేందుకు చర్యలు చేపట్టనుంది.

ఇవి కూడా చదవండి

వినియోగదారులను చాలాసార్లు హెచ్చరించాం:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ చాలా ఖాతాలలో గత రెండు-మూడేళ్లుగా ఖాతాదారుడు ఎటువంటి లావాదేవీలు చేయలేదని, వాటిలో బ్యాలెన్స్ లేదని గమనించింది. అటువంటి పరిస్థితిలో ఈ ఖాతాల దుర్వినియోగాన్ని నిరోధించే చర్యగా, వాటిని మూసివేయాలని నిర్ణయించారు. ఈ విషయమై బ్యాంకు ఖాతాదారులకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా, ఇంకా అలానే ఉంటున్నాయని బ్యాంకు చెబుతోంది. ఇప్పుడు బ్యాంకు మరోసారి అప్రమత్తం చేసింది. అటువంటి కస్టమర్‌లందరూ వీలైనంత త్వరగా తమ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలి.

ఈ ఖాతాలు మూసివేయబడవు

ఎలాంటి నోటీసులు లేకుండానే అటువంటి ఖాతాలన్నీ మూసివేయబడతాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, డీమ్యాట్ ఖాతాలకు లింక్ చేయబడిన అటువంటి ఖాతాలు మూసివేయరు. అదే సమయంలో, 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్‌లతో ఉన్న విద్యార్థుల ఖాతాలు, మైనర్‌ల ఖాతాలు, SSY/PMJJBY/PMSBY/APY వంటి పథకాల కోసం తెరిచిన ఖాతాలు కూడా బ్యాంకు మూసి వేయదని గుర్తించుకోండి.

ఖాతాను సక్రియం చేయడానికి ఈ పనులు అవసరం

ఖాతాదారులకు హెచ్చరికతో పాటు మీ ఖాతాకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలనుకుంటే మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించవచ్చు. ఖాతాదారుడు సంబంధిత శాఖలో తన ఖాతా KYCకి సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలను సమర్పించే వరకు అటువంటి ఖాతాలు మళ్లీ యాక్టివేట్ చేయలేరు. అంటే, మీరు మీ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే, బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి వెంటనే KYCని పూర్తి చేయండి.

Important Announcement. Please instrumentality a note.#inoperativeaccount #bankaccount #ImportantNotice #banking #PNB pic.twitter.com/BzNktR0xeP

— Punjab National Bank (@pnbindia) September 21, 2024

ఇది కూడా చదవండి: ATM Card Insurance: ఏటీఎం కార్డుపై రూ.10 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా? క్లెయిమ్‌ చేయడం ఎలా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article