దేశ వ్యాప్తంగా ఉన్న కర్ణాటక బ్యాంకు బ్రాంచుల్లో.. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్‌ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు నవంబర్ 30, 2024వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. మొత్తం ఖాళీల వివరాలు ఇంకా తెలియజేయలేదు. త్వరలోనే బ్రాంచుల వారీగా పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచనున్నారు.
కర్ణాటక బ్యాంకులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి నవంబర్ 01, 2024 నాటికి గరిష్ఠంగా 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చొప్పున ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.24,050 నుంచి రూ.64,480 వరకు జీత భత్యాలు చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం..
రాత పరీక్ష మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. రీజనింగ్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు కేటాయిస్తారు. బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, పుణె, మంగళూరు, ధార్వాడ్/ హుబ్బల్లి, మైసూరు, శివమొగ్గ, కలబురగి నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ఇవి కూడా చదవండి
ముఖ్య తేదీల వివరాలు ఇవే..
- నోటిఫికేషన్ జారీ తేదీ: నవంబర్ 20, 2024.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: నవంబర్ 20, 2024.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్ 30, 2024.
- ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 15, 2024.