మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హిట్టు, ప్లాపులతో ఎలాంటి సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన లేటేస్ట్ మూవీ ‘బరోజ్ త్రీడీ’. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. మొదటిసారిగా దర్శకుడిగా మోహన్ లాల్ తెరకెక్కించిన సినిమా ఇది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ప్రేక్షకులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.
బరోజ్: ది గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్ మ్యాజిక్ మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషలలోనూ ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోని పెరుంబవూర్ నిర్మించగా.. ఈ సినిమా నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది.
కథ విషయానికి వస్తే..
ఒకప్పుడు గోవాను పాలించిన పోర్చుగీసు రాజు డి గామా వంశానికి చెందిన నిధి చుట్టూ సాగే కథ ఇది. రాజుకు నమ్మిన బంటు అయిన బరోజ్ (మోహన్ లాల్) నాలుగు శతాబ్దాలుగా ఆ నిధిని కాపాడుతూ ఉంటాడు. డి గామా వారసులు వస్తే వాళ్లకు ఆ నిధిని అప్పగించాలని చూస్తుంటాడు. అయితే ఆ రాజవంశం పదమూడో తరానికి చెందిన ఇసబెల (మాయ రావు) తన తండ్రితో కలిసి గోవాకు వస్తుంది. ఆమెకు బరోజ్ నిధిని అందించాడా..? ఆ అమ్మాయి రాజవంశానికి చెందిన వారసురాలు అని అతడికి ఎలా తెలిసింది అనేది సినిమా.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..