యూనియన్ బడ్జెట్ 2025: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (31 జనవరి 2025) ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. దీని తరువాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (31 జనవరి 2025) లోక్‌సభ, రాజ్యసభలో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: బడ్జెట్ రోజు మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
మోడీ 3.0 హయాంలో మొదటి పూర్తి బడ్జెట్
ఇవి కూడా చదవండి
ఆర్థిక సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేస్తుంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తుంది. దేశంలో మొదటి ఆర్థిక సమీక్షను 1950-51లో సమర్పించారు. అప్పట్లో అది బడ్జెట్ పత్రంలో భాగం. పార్లమెంటులో సమర్పించిన ఆర్థిక సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి 6.4 శాతానికి చేరుకోవచ్చని అంచనా. ఆర్థిక మంత్రి 1 ఫిబ్రవరి 2025న పార్లమెంట్‌లో మోదీ 3.0 పదవీకాలానికి సంబంధించిన మొదటి పూర్తి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు సంబంధించి చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిని పోటీ పరీక్షలలో అడగవచ్చు.
బడ్జెట్ సంబంధిత ప్రశ్నలు, సమాధానాలు
1.ప్రశ్న: దేశంలో మొదటి ఆర్థిక సర్వే ఎప్పుడు జరిగింది?
సమాధానం: 1950-51
2. ప్రశ్న: భారత కేంద్ర బడ్జెట్‌ను ఎవరు సమర్పిస్తారు?
జవాబు: ఆర్థిక మంత్రి
3. ప్రశ్న: భారతదేశంలో ఆర్థిక సంవత్సరం వ్యవధి ఎంత?
సమాధానం: ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు
4. ప్రశ్న: స్వతంత్ర భారతదేశానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన మొదటి ఆర్థిక మంత్రి పేరు ఏమిటి?
సమాధానం: ఆర్. షణ్ముఖం చెట్టి
5. ప్రశ్న: ఆర్థిక లోటు అంటే ఏమిటి?
జవాబు : మొత్తం ఖర్చు, మైనస్ మొత్తం (అప్పు తీసుకోవడం మినహా)
6. ప్రశ్న: భారతదేశంలో ఏ ఇద్దరు ఆర్థిక మంత్రులకు బడ్జెట్‌ను సమర్పించే అవకాశం రాలేదు?
సమాధానం: క్షితిజ్ చంద్ర నియోగి (KC నియోగి),హేమవతి నందన్ బహుగుణ (H.N. బహుగుణ)
7. ప్రశ్న: ఏ రాజ్యాంగ ఆర్టికల్ కేంద్ర బడ్జెట్‌కు సంబంధించినది?
సమాధానం: ఆర్టికల్ 112
8. ప్రశ్న: కేంద్ర బడ్జెట్‌లో ఏ రంగానికి అత్యధికంగా కేటాయింపులు జరుగుతాయి?
సమాధానం: రక్షణ
9. ప్రశ్న: GDP (Gross Domestic Product) అంటే ఏమిటి?
జవాబు: స్థూల దేశీయోత్పత్తి
10. ప్రశ్న: ఇప్పటివరకు ఏ ఆర్థిక మంత్రి సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు?
సమాధానం: నిర్మలా సీతారామన్ (ఫిబ్రవరి 1, 2020న 2 గంటలు)
ఇది కూడా చదవండి: Bank Holidays In February 2025: వినియోగదారులకు అలర్ట్.. ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో అంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి