Budget 2025: పార్లమెంట్లో మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్ 2025 ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో పలు రంగాలకు వరాలు కురిపించారు. రైతులతో పాటు వివిధ రంగాల అంశాలపై ప్రకటనలు చేస్తున్నారు. అలాగే మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై ప్రకటన చేశారు. వైద్య విద్యార్థుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి మెడికల్ కాలేజీలో 10 వేల సీట్లు పెంచుతామని వెల్లడించారు. అలాగే ఐటీ సామర్థ్యం పెరిగిందని, 5 IITలలో అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించనున్నట్లు చెప్పారు. IIT పాట్నా విస్తరించనున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 75,000 కొత్త యూజీ మెడికల్ సీట్లను ప్రభుత్వం చేర్చనుంది మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.
డాక్టర్లు కావాలని కలలు కనే వారికి ఇది శుభవార్త. ఇప్పుడు దేశంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది MBBS లో ప్రవేశం పొందడం సులభతరం చేస్తుంది. మెడిసిన్ చదివే వారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో అనేక బహుమతులు ఇచ్చారు.
దేశంలోని వైద్య కళాశాలల్లో ఇప్పుడు మొత్తం 1,12,112 MBBS సీట్లు ఉన్నాయి. వీటి కోసం ప్రతి సంవత్సరం అడ్మిషన్ కోసం పోరాటం జరుగుతుంది. ఈ సీట్లకు నీట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. 2014 సంవత్సరం వరకు మొత్తం MBBS సీట్లు 51348 ఉండగా, 2014 వరకు దేశంలో మొత్తం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జూలై 2024 వరకు ఉన్న డేటా ప్రకారం.. ఇప్పుడు దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 731. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కూడా పెంచారు. 2014 వరకు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 31185 కాగా, జూలై 2024 నాటికి ఈ సీట్ల సంఖ్య 72627కి పెరిగింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి