అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇక సాంగ్స్ మాత్రం యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, ముంబై, చెన్నైలో తండేల్ స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. హీరోయిన్ సాయి పల్లవి అనారోగ్యానికి గురయ్యారని కొన్ని రోజులుగా వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు డైరెక్టర్ చందు మొండేటి. ముంబైలో జరిగిన తండేల్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఆమె రాకపోవడంపై స్పందిస్తూ సాయి పల్లవి హెల్త్ అప్డేట్ ఇచ్చారు.
“సాయి పల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆమె సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమె మరింత నీరసించారు. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజులపాటు బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. అందుకే ఆమె ముంబై వేదికగా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు” అంటూ చెప్పుకొచ్చారు చందు మొండేటి.
తండేల్ చిత్రాన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ ప్రేమకథలో రాజుగా నాగచైతన్య, బుజ్జితల్లిగా సాయి పల్లవి కనిపించనున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరెకక్కించిన లవ్ స్టోరీ తర్వాత వీరిద్దరి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన