సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటుంది. అలా తాజాగా సామ్ షేర్ చేసిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల కేరళలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలన సృష్టించింది. తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం అందరినీ కలచి వేసింది. ఇప్పుడు ఇదే ఘటనపై నటి సమంత స్పందించింది. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సామ్ కోరుతోంది.
‘మనం 2025లో ఉన్నాం. అయినప్పటికీ స్వార్థం, ద్వేషం, విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయాడు. హేళనగా చూడటం, వేధింపులు, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలు ఉన్నాయి. అయితే దీని వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందోనని చాలామంది విద్యార్థులు మిన్నకుండిపోతున్నారు. మనం ఎక్కడో విఫలం అవుతున్నాం. ఈ ఘటనపై సంతాపం, పరామర్శలు తెలియజేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. సంబంధిత అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నాను. నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, ఎదుటి వారినుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి ధైర్యంగా బయటకు మాట్లాడాలి. తద్వరాఆ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్‌గా నిలవండి’ అని సమంత పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి
పికిల్ బాల్ గేమ్ టోర్నీలో సమంత..
మరోవైపు మహానటి కీర్తి సురేశ్ కూడా ఈ దారుణ ర్యాగింగ్ ఘటనపై స్పందించింది. ఆ బాలుడికి న్యాయం జరగాలని , బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసిందీ అందాల తార. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు కేరళ ర్యాగింగ్ ఘటనపై గళమెత్తుతున్నారు.
సమంత లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి