— కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్.. విశాఖ పోర్టుతో పాటు.. ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధులిచ్చింది కేంద్రం. పోలవరం ప్రాజెక్ట్‌కు 5వేల 936 కోట్లు, ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా 12వేల 157కోట్లు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 3వేల 295 కోట్లు కేటాయించింది కేంద్రం. ఇక విశాఖ పోర్టుకు 730 కోట్లు, ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి 162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌కు 186 కోట్లు ఇచ్చింది. లెర్నింగ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు 375 కోట్లు, రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీ హుడ్ ప్రాజెక్ట్ రెండో దశకు 242 కోట్లు కేటాయించింది కేంద్రం.
— పోలవరం ప్రాజెక్ట్‌కు గతేడాది కంటే 400కోట్లు అదనంగా కేటాయింపులు జరిగాయి. విశాఖ పోర్టుకు కూడా గతేడాదితో పోలిస్తే 445 కోట్లు అధికంగా ఇస్తున్నామని తెలిపింది కేంద్రం.
— కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రతిపాదనను అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పారు. వికసిత భారత్ ఆవిష్కరణను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. మధ్య తరగతి ప్రజలు, పేదలు, మహిళలు, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకర పరిణామం అన్నారు.
I widen my heartfelt congratulations to the Union Government and Hon'ble Finance Minister, Smt. @nsitharaman Ji, for presenting a pro-people and progressive budget. This fund reflects the imaginativeness for a Viksit Bharat nether the enactment of Hon'ble Prime Minister Shri… pic.twitter.com/6QrB0CDmk2
— N Chandrababu Naidu (@ncbn) February 1, 2025
AP ప్రజల తరఫున నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. 2028 వరకు జల్ జీవన్ పొడిగింపుతో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. ఎంత వీలైతే అంత మొత్తంలో ఏపీకి నిధులు తెస్తామని చెప్పారు రామ్మోహన్ నాయుడు.
— సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే బడ్జెట్ ఇది అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మరో 3 వేల కోట్లు, పోలవరం సవరించిన అంచనా ప్రకారం 35వేల 400 కోట్లలో.. రూ.12 వేల కోట్లు ఏపీకి కేంద్రం ఇస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. బడ్జెట్‌లో బొమ్మల తయారీకి శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వడం శుభపరిణామని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి