ఈ నెల (ఫిబ్రవరి) 12 నుంచి 27 వరకు బుధుడు కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతోంది. తెలివి తేటలు, ప్రతిభ, నైపుణ్యాలు, ప్రణాళికలు, సమయస్ఫూర్తికి కారకుడైన బుధుడు తన మిత్ర క్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేయడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఏ పని తలపెట్టినా విజయవంతం కావడం, కొన్ని కీలక సమస్యలు పరిష్కారం కావడం, మంచి గుర్తింపు రావడం వంటివి జరుగుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభరాశుల వారికి ఇటువంటి ప్రయోజనాలన్నీ కలిగే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Feb 06, 2025 | 7:17 PM
మేషం: ఈ రాశికి బుధుడు లాభ స్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
1 / 6
వృషభం: ఈ రాశికి బుధుడు దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగపరంగా అనేక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు, నైపుణ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీ సలహాలు, సూచనలు అధికారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా మీ పథ కాలు, వ్యూహాలు శుభ ఫలితాలనిస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది.
2 / 6
మిథునం: రాశినాథుడైన బుధుడు భాగ్య స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ 15 రోజుల కాలంలో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా అదృష్టవంతులవుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యు లేషన్ల మీద పెట్టుబడులు పెట్టడం వల్ల ధన లాభాలు కలుగుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
3 / 6
తుల: ఈ రాశికి అయిదవ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. రాబడికి లోటుండదు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. అనేక శుభవార్తలు వింటారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు ఇతర లావా దేవీల్లో పెట్టుబడుల వల్ల ధన లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో సత్సంబందాలు ఏర్పడతాయి.
4 / 6
మకరం: ఈ రాశివారికి ధన స్థానంలో బుధుడు ప్రవేశించడం వల్ల ఆదాయాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చుల్ని బాగా తగ్గించుకుని, పొదుపు మార్గాలను అనుసరిస్తారు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు ఆశించిన లాభాలనిస్తాయి.
5 / 6
కుంభం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఆర్థికపరమైన జీవితాన్ని, జీవన శైలిని మెరుగుపరచుకోవ డానికి అనేక అవకాశాలు అందివస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. అందువల్ల కొద్దిపాటి ప్రయత్నం, ప్రణాళిక, బుద్ధి చాతుర్యంతో బాగా అభివృద్ధిలోకి రావడంతో పాటు, కొన్ని ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఈ రెండు వారాల సమయంలో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.
6 / 6