యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నయా మూవీ లైలా. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విశ్వక్ సేన్. రీసెంట్ డేస్ లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు. ఇప్పుడు లైలాగా మరోసారి మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. అన్ని హంగులను పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో చేస్తున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. రీసెంట్ గా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.
అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవలే గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా గురించి, హీరో విశ్వక్ సేన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న విశ్వక్ సేన్ తాజాగా ఓ వెరైటీ ప్రమోషన్ చేశారు. రీసెంట్ డే లో బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన బుల్లిరాజుతో ఓ ఫన్నీ వీడియో చేశారు విశ్వక్ సేన్.
రేవంత్ భీమల.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా నటించి మెప్పించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. అలాగే సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అయ్యింది. తాజాగా బుల్లిరాజు లైలా కోసం ఓ ఫన్నీ వీడియో చేశారు. ఎవరు ఈ లైలా.? ఎలాగైనా పట్టుకొని మా నాన్నకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ ఫన్నీగా వీడియో చేశాడు ఈ బుడతడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అరేయ్ పేటీఎమ్స్ మీరు బాయ్ కాట్ అంటే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు
మా లైలా పిన్ని కోసం నేనున్నా 💪
అందుకే నేను ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నా 💗 All The Best ra Sonu @VishwakSenActor సినిమా బ్లాక్ బస్టర్ పక్కా 🥳#SupportLailaMovie pic.twitter.com/aPxjMkMktl
— Bulli Raju (@bullii_raju) February 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.