దేశాలకు, కార్పొరేట్ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ- భారతీయులు, భారతీయ సంతతి ప్రముఖులు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు కూడా భారతీయ సంతతి వ్యక్తులు నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ..
కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతికి చెంది పార్లమెంటు సభ్యులు పోటీ పడుతున్నారు. కెనడా ప్రధాని పదవికి నేపియన్ నుంచి ఎంపీగా ఎన్నికైన చంద్ర ఆర్యా ఏకంగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆ దేశ పార్లమెంటు సభ్యురాలు అనితా ఆనంద్ సైతం రేసులో ఉన్నారు. ప్రధాని పదవికి ట్రూడో రాజీనామాతో కొత్త లీడర్ కోసం అన్వేషణ మొదలైంది. మార్చి 24కల్లా కెనడా కొత్త ప్రధాని ఎన్నికయ్యే అవకాశం ఉంది.
ఇటీవల, కెనడాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని హామీ ఇచ్చారు. కెనడా ప్రధానమంత్రి పదవి కోసం మరో భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి కోసం తాను రంగంలోకి దిగనున్నట్టు భారత సంతతి, కెనడా ఎంపీ చంద్ర ఆర్య ఇప్పటికే ప్రకటించారు. తాజాగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్య. అయితే మార్చి 9న కెనడా కొత్త ప్రధాని ఎవరనేది స్పష్టత వస్తుంది. ఒట్టావాలోని నేపియన్ నుంచి ఎంపీగా ఎన్నికైన చంద్ర ఆర్యా కర్ణాటకలో జన్మించారు. 20 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ ర్‌గా కెరీర్ ప్రారంభించారు. పారిశ్రామి కవేత్తగా ఎదిగారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015, 2019ల్లో కెనడా హౌస్ ఆఫ్ కామన్స్ ఎన్నికల్లో వరుసగా గెలిచారు ఆర్య.
అనితా ఆనంద్ 2019 నుంచి ఎంపీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కెనడా రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో న్యాయశాఖ ప్రొఫెసర్‌గా వ్యవహరించారు అనితా ఆనంద్. అలాగే రోట్మన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లోని క్యాపిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాలసీ అండ్ రీసెర్చ్ డైరక్టర్‌గా సేవలు అందించారు. కరోనా సంక్షోభకాలంలో అనితా ఆనంద్ పనితీరుపై కెనడాలో ప్రశంసలు వచ్చాయి. ప్రజలకు వైద్య పరికరాలు, ఆక్సిజన్, మాస్కులు, PPE కిట్స్, టీకాలు అందించడంలో అనితా ఆనంద్ ముఖ్యపాత్ర పోషించారు. కెనడాలో 1993లో తొలి మహిళా ప్రధానిగా క్యాంప్‌బెల్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అన్నీ కుదిరి, అనితా ఆనంద్‌ని అదృష్టం వరిస్తే, కెనడాకు విదేశీ మూలాలున్న తొలి ప్రధానిగా రికార్డు సృష్టిస్తారు.
ఇక మరొకరు జార్జ్ చాహల్, అల్బెర్టా నుండి లిబరల్ పార్టీ తరుఫున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రసిద్ధ న్యాయవాది, సిక్కు సమాజంలో బలమైన నాయకుడు. అతను గతంలో కాల్గరీ సిటీ 5వ వార్డుకు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఇటీవల తన సహోద్యోగులకు రాసిన లేఖలో, చాహల్ తన అభ్యర్థిత్వానికి మద్దతును అభ్యర్థించారు. అనేక మంది ఎంపీల నుండి మద్దతు పొందారు. ప్రస్తుతం, అతను సహజ వనరులపై స్టాండింగ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అంతేకాకుండా సిక్కు కాకస్‌కు నాయకత్వం వహిస్తున్నారు ట్రూడోను విమర్శించడంలో.. అతని రాజీనామా కోసం వాదించడంలో చాహల్ కీలక పాత్ర పోషించారు. అయితే, లిబరల్ లెజిస్లేటివ్ కాకస్‌కి తాత్కాలిక నాయకుడిగా నియమితులైన చాహల్, కెనడియన్ చట్టం కారణంగా ప్రధానమంత్రి పదవికి అర్హత పొందకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. తాత్కాలిక నాయకులను ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి అనర్హులను చేసిందని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..