Canada : ఖలిస్తానీ నెట్‌వర్క్ ఎలా విస్తరించింది.. కెనడా వెళ్ళిన మొదటి సిక్కు ఎవరు?

2 hours ago 1

భారత్-కెనడా దేశాల మధ్య ఇప్పటికే విబేధాలు తారాస్థాయికి చేరాయి. భారత్‌తో దౌత్యపరంగా కయ్యానికి దిగుతున్న కెనెడా పైత్యం మరో రేంజ్‌కు చేరింది. ఖలిస్థానీ మిలిటెంట్‌ మూకలకు వత్తాసు పలుకుతున్న జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం, మళ్లీ తన కురచబుద్ధిని చాటుకుంది. భారత్‌పై విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. తాజాగా హిందూ ఆలయంపై దాడులతో అది అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

భారత్-కెనడా సంబంధాలు రోజు రోజుకూ దెబ్బతింటున్నాయి. వివాదానికి కారణం కెనడా ప్రభుత్వం ఖలిస్తానీలపై ప్రేమను ఒలకపోయడమే. తాజాగా కెనడాలో హిందూ దేవాలయాలపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బ్రాంప్టన్ నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద జెండాలు పట్టుకుని హిందూ సభ ఆలయానికి చేరుకుని భక్తులను కొట్టారు. ఈ ఘటనను ఖండిస్తూ కెనడా ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అధిక సంఖ్యలో భారతీయులు నివసించే దేశాల్లో కెనడా ఒకటి. కెనడా జనాభాలో సిక్కుల వాటా 2.1%. భారతదేశం కాకుండా, కెనడాలో అత్యధిక సిక్కు జనాభా ఉంది.

పెరుగుతున్న సంఖ్యల కారణంగా, కెనడియన్ ప్రభుత్వం చివరికి కఠినమైన నిబంధనలను విధించింది. వలసలను నిలిపివేసింది. కెనడాలో ప్రవేశించడానికి భారతీయులు 200 డాలర్లు కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. అయినప్పటికీ భారతీయుల వలసలు ఆగలేదు. అయితే, ఈ గణాంకాలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు. సిక్కులు ఒక శతాబ్దానికి పైగా కెనడాలో నివసిస్తున్నారు. సిక్కులు కెనడాకు ఎందుకు వెళ్లడం ప్రారంభించారు? కెనడా వెళ్ళిన మొదటి సిక్కు ఎవరు? పూర్తి చరిత్ర తెలుసుకుందాం..!

భారత్ – కెనడా దేశాల మధ్య ఉద్రిక్తత పెరగడం.. అక్కడ నివసించే భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారతీయ విద్యార్థుల రాకతో కెనడా ఆర్థికంగా బలపడిందన్నదీ వాస్తవం. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వం కెనడా పౌరుల భారత్‌లోకి ప్రవేశించడాన్ని నిలిపివేసింది. కెనడాలో భారత్ తన వీసా సేవలను నిలిపివేసింది. ఈ దాడులు సంబంధాలను మరింత దిగజార్చుతున్నాయి. కెనడాలో ఖలిస్తాన్ నెట్‌వర్క్ ఎలా విస్తరించిందనే ప్రశ్న తలెత్తుతోంది. అతని కథ ఏమిటి? కెనడాలో భారతీయ జనాభా ఎంత?

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, డిసెంబర్ 2023 వరకు, ప్రస్తుతం కెనడాలో 18 లక్షల మంది భారతీయ సంతతి పౌరులు ఉండగా, 10 లక్షల మంది భారతీయులు కెనడాలో నివసిస్తున్నారు. కెనడాలో రెండు లక్షల 30 వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. ఇది మాత్రమే కాదు, 600 కంటే ఎక్కువ కెనడియన్ కంపెనీలు భారతదేశంలో ఉన్నాయి. 1000 కంటే ఎక్కువ కంపెనీలు భారతదేశంతో చురుకుగా వ్యాపారం చేస్తున్నాయి. కెనడాలో ఐటి, సాఫ్ట్‌వేర్, ఉక్కు, సహజ వనరులు, బ్యాంకింగ్ రంగాలలో భారతీయ కంపెనీలు కూడా చురుకుగా పనిచేస్తున్నాయి.

నిజానికి, బ్రిటిష్ పాలనలో, భారతీయ సిక్కులు సాయుధ సేవల్లో పాల్గొన్నారు. 1897లో, క్వీన్ విక్టోరియా తన డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి బ్రిటిష్ ఇండియన్ సైనికుల బృందాన్ని లండన్‌కు ఆహ్వానించింది. ఈ సమయంలో, బ్రిటిష్ కొలంబియాలో రాణితో అశ్వికదళ సైనికుల బృందం ఉంది. ఈ సైనికులలో రిసాలెదార్ మేజర్ కేసర్ సింగ్ కూడా ఉన్నారు. అతను కొంతమంది సైనికులతో కెనడాలో ఉండాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ కొలంబియాలో ఉన్నారు. అప్పటి నుంచి భారతీయులు కెనడాలో స్థిరపడటం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలలో 5000 మంది భారతీయులు బ్రిటిష్ కొలంబియాకు చేరుకున్నారు. వీరిలో 90 శాతం మంది సిక్కులే కావడం విశేషం.

అంటే, బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో మేజర్ కేసూర్ సింగ్ (25వ అశ్వికదళం, ఫ్రాంటియర్ ఫోర్స్) కెనడాకు వచ్చిన మొదటి సిక్కుగా పరిగణిస్తారు. హాంకాంగ్ రెజిమెంట్‌లో భాగంగా వాంకోవర్‌కు వచ్చిన మొదటి సిక్కు సైనికుల బృందంలో అతను కూడా ఉన్నాడు. చైనా, జపాన్ సైనికులు వేడుకల్లో చేరారు. భారతీయ సిక్కులు 19వ శతాబ్దం చివరిలో ఫార్ ఈస్ట్-చైనా, సింగపూర్, ఫిజీ, మలేషియా తూర్పు ఆఫ్రికాలో నివసించడానికి వలస వెళ్లారు. అయినప్పటికీ, కెనడాకు సిక్కుల వలస మొదటి తరంగం 1900ల ప్రారంభంలో జరిగింది. చాలా మంది వలస సిక్కులు ఉద్యోగాలు, ఉపాధి కోసం కెనడాకు వచ్చారు. ఈ వ్యక్తులు కార్మికులుగా పనిచేయడానికి బ్రిటిష్ కొలంబియాకు తయారీ రంగంలో పనిచేయడానికి అంటారియోకు వెళ్లారు.

ఇలా కెనడాకు చేరుకున్న వారిలో 5,000 కంటే కొంచెం ఎక్కువ మాత్రమే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన పురుషులే. కానీ స్థిరపడే ఉద్దేశం మాత్రం మాత్రం లేదు. వలసదారుల ఆలోచన ఏమిటంటే, వారు మూడు నుండి ఐదు సంవత్సరాల మధ్య మాత్రమే అక్కడ ఉండాలన్న నిబంధన ఉండేది. ఇలా వలస వచ్చినవారు కెనడాలో సులభంగా పనిని సంపాదించుకున్నారు. కానీ త్వరలోనే వారు కూడా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. స్థానికుల ఉపాధి, ఉద్యోగాలను వలసదారులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సిక్కులు జాతి, సాంస్కృతిక పక్షపాతాలను కూడా ఎదుర్కొన్నారు. కెనడాకు ఎక్కువ మంది సిక్కులు రావడంతో పరిస్థితి మరింత దిగజారింది. పెరుగుతున్న సంఖ్యల కారణంగా, కెనడియన్ ప్రభుత్వం చివరికి కఠినమైన నిబంధనలను విధించింది. వలసలను ఆపేసిన సర్కార్.. కెనడాలో ప్రవేశించడానికి భారతీయులు 200 డాలర్లు చెల్లించాలని తప్పనిసరి చేసింది. ఫలితంగా, 1908 తర్వాత భారతదేశం నుండి కెనడాకు వలసలు గణనీయంగా తగ్గాయి. 1907 08 సమయంలో సంవత్సరానికి 2,500 నుండి కేవలం కొన్ని డజన్ల వరకు మాత్రమే భారతీయులు కెనడాకు వెళ్లడం విశేషం.

ఇక రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కెనడా ఇమ్మిగ్రేషన్ విధానం సడలించింది. 1967లో కెనడియన్ ప్రభుత్వంచే ‘పాయింట్ సిస్టమ్’ ప్రవేశపెట్టింది. ఆధారపడిన బంధువులు దేశంలోకి ప్రవేశించడానికి నైపుణ్యాన్ని మాత్రమే ప్రమాణంగా చేసింది. ఏదైనా నిర్దిష్ట జాతికి ఇచ్చిన ప్రాధాన్యతను తొలగించింది. దీంతో 1991 నుండి కెనడాలో సిక్కు జనాభాలో విపరీతమైన పెరుగింది. 2021 జనాభా లెక్కల ప్రకారం, కెనడాలో సిక్కుల సంఖ్య 7.71 లక్షలకు చేరుకుంది. ఇది మొత్తం జనాభాలో దాదాపు 2.1%. వీరిలో 2.36 లక్షల కంటే ఎక్కువ మంది అంటే సుమారు 30% పుట్టుకతో కెనడియన్ పౌరులు. 4.15 లక్షల కంటే ఎక్కువ మంది శాశ్వత నివాసి హోదాను కలిగి ఉన్నారు. 1.19 లక్షల కంటే ఎక్కువ మంది శాశ్వత నివాసితులుగా కొనసాగుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article