ఆచార్య చాణక్య పుస్తకం నీతి శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివరించాడు. ఈ గ్రంథంలో, ఆచార్య చాణక్యుడు విజయవంతం కావడానికి చిట్కాలను కూడా ఇచ్చాడు. నేటి జనరేషన్ కు చెందిన వ్యక్తులు కూడా తమ జీవితంలో ఈ నీతి సూత్రాలను అవలంబిస్తే.. వారు విజయం సాధించగలరని పెద్దలు చెబుతారు. ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితాంతం పేదలుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి ఎప్పటికీ పేదరికంలో జీవించడానికి అనేక కారణాలను చెప్పాడు.
ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం: వ్యక్తుల పేదరికానికి మొదటి కారణం కర్మ. ఎవరైనా కష్టపడి పనిచేయకపోతే.. వారు అభివృద్ధి చెందడం చాలా కష్టం. అదే సమయంలో కొన్ని తప్పుడు ప్రదేశాలలో నివసించడం వల్ల అతడు తన జీవితంలో ఎప్పుడూ పురోగతి సాధించలేడు. విజయం సాధించడంలో వెనుకబడి ఉంటాడు. ఆ స్థలాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ ప్రదేశాలలో నివసించే ప్రజలు అభివృద్ధి చెందరు
ధనికః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పఞ్చమః । పఞ్చ యత్ర న విద్యంతే న తత్ర దివసే వసేత్ ॥
ఇవి కూడా చదవండి
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలోని మొదటి అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకంలో ఐదు ప్రదేశాలలో నివసించే వ్యక్తులు ఎల్లప్పుడూ పేదలుగా నివసిస్తారని.. జీవితంలో సంతోషంగా ఉండరని చెప్పారు. అలాంటి వ్యక్తులు ఎంత ప్రయత్నం చేసినా ఎప్పటికీ పురోగమించలేరు. అలాంటి వారు మూర్ఖులుగా జీవిస్తారు. ఈ వ్యక్తులకు పురాణ జ్ఞానం ఉండదు.. వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించరు.
బ్రాహ్మణులు లేని ప్రదేశం: చాణక్యుడు ప్రకారం వేదాలు తెలిసిన బ్రాహ్మణులు నివసించని ప్రదేశంలో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ పేదలుగా నివసిస్తారు. అటువంటి పరిస్థితిలో అటువంటి స్థలాన్ని వదిలివేయాలి. బ్రాహ్మణులు ఎల్లప్పుడూ మతపరమైన పనుల ద్వారా మతాన్ని రక్షిస్తారు.
వ్యాపారవేత్తలు: వ్యాపారవేత్తలు నివసించని ప్రదేశంలో నివసించే వారు ఎప్పటికీ పేదలుగా జీవిస్తారు. అక్కడ నివసించే ప్రజలు సొంతంగా దొరికిన పనులు చేసుకుంటూ జీవిస్తారు. దుర్భర జీవితాన్ని గడుపుతారు. కనుక వ్యాపారవేత్తలు లేని ప్రదేశాన్ని కూడా వదిలివేయాలి.
అద్భుతమైన పాలన ఆధికారులు: నీతి నిజాయతీ లేని అధికారులు లేని ప్రదేశంలో పాలన సరిగ్గా ఉండదు. పాలనా లోపం వల్ల అక్కడ అరాచకం విస్తరిస్తుంది. అలాంటి చోట నివసించడం వల్ల ఎవరూ అభివృద్ధి చెందలేరు. అభివృద్ధి పన్ను వసూలు చేసినా డబ్బు దోచుకుంటారు.
నది లేని ప్రదేశంలో: మానవ జీవితంలో నీరు అత్యంత అవసరమైన వస్తువు. నది లేని ప్రదేశంలో నివసించడం తగదని.. నది లేకుండా జీవితం చాలా కష్టమని చాణక్యుడు చెప్పాడు. జీవితం, నీటిపారుదల రెండింటికీ నీరు అవసరం కనుక నదులు లేని చోట నివసించ వద్దు.
డాక్టర్ లేని ప్లేస్: ఆచార్య చాణక్యుడు ప్రకారం వైద్యుడు లేని ప్రదేశంలో నివసించడం సరికాదు. ఏదైనా వ్యాధి కలిగినప్పుడు తగిన చికిత్స అవసరం. డాక్టర్ లేకుండా సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో.. ఈ ఐదు ప్రదేశాలను వదిలివేయాలి. ఈ ప్రదేశాల్లో నివసించే వ్యక్తులు ఎప్పటికీ విజయం సాధించలేరు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.