పుష్ప సినిమాలో జాలి రెడ్డి అలరించిన కన్నడ నటుడు డాలీ ధనంజయ్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ధన్యత అనే వైద్యురాలితో కలిసి వైవాహిక జీవితం ప్రారంభించనున్నాడు. త్వరలోనే వీరి వివాహం మైసూరు వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ ను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికలు అంద జేశాడు డాలీ ధనుంజయ్.
Updated on: Feb 08, 2025 | 2:07 PM
అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమాలో జాలి రెడ్డిగా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు డాలీ ధనంజయ్. ఈ మధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా సినిమాలోనూ ఓ కీలక పాత్రలో డాలీ బాగా ఆకట్టుకున్నాడు.
1 / 6
సినిమాల సంగతి పక్కన పెడితే డాలీ ధనుంజయ్ త్వరలోనే ధన్యత అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. ఫిబ్రవరి 16న మైసూర్‌లో వీరి వివాహం జరగనుంది.
2 / 6
ఈ నేపథ్యంలో డాలీ ధనంజయ అల్లు అర్జున్ ను ప్రత్యేకంగా కలిసి తన వివాహ ఆహ్వానం పత్రికను అందజేశాడు. అలాగే డైరెక్టర్ సుకుమార్ ను కూడా కలిసి తన వివాహ వేడుకకు ఆహ్వానించాడు.
3 / 6
అలాగే నటి రష్మిక మందన్నా, పుష్ప నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ను కూడా కలిశాడు డాలీ. తన పెళ్లికి తప్పకుండా రావాలని ఆహ్వానించాడు
4 / 6
కాగా గతేడాది నవంబర్ 17న డాలీ ధనుంజయ, ధన్యతల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు కాబోయే దంపతులు.
5 / 6
డాలీ ధనంజయ్ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా, మాటల రచయితగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇక ధన్యత విషయానికి వస్తే ఆమె వృత్తిరీత్యా డాక్టర్.
6 / 6