రేణుకాస్వామి హత్యకేసులో ఐదు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్. ఎట్టకేలకు అతనికి బెయిల్ మంజూరు అయ్యింది. దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దర్శన్ ఆరోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు మధ్యంతర బెయిల్‌కు తగిన షరతులను న్యాయస్థానం విధించింది.
ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా
అంతకుముందు కింది కోర్టులో దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు. అనంతరం దర్శన్ తరపు న్యాయవాది సీవీ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ ఆరోగ్య సమస్య బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో అభ్యర్థించారు. దర్శన్‌కి తీవ్రమైన వెన్నునొప్పి ఉంది.. అలాగే శస్త్రచికిత్స అవసరం. చికిత్స ఆలస్యమైతే పక్షవాతం వస్తుందేమోనని అనుమానం ఉందని డాక్టర్ ఇచ్చిన నివేదికను దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్
దర్శన్ ఆరోగ్య సమస్యలపై నివేదిక ఇచ్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ కోర్టు ముందు వాదించారు. అలాగే ఇప్పుడు సమర్పించిన డాక్టర్ రిపోర్టులో దర్శన్‌కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్ ఇప్పుడు ‘విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని’ అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇది ఆరు వారాల మధ్యంతర బెయిల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.