Delhi Election 2025 Results LIVE: Delhi Election 2025 Results LIVE: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హస్తినలో జెండా పాతాలని మూడు పార్టీలు గట్టిగానే ప్రయత్నం చేశాయి. దీంతో కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారా? లేక బీజేపీ విజయదుందుభి మోగిస్తుందా? కాంగ్రెస్ ఈ సారైనా సత్తా చూపిస్తుందా? అని దేశమంతా ఎదురుచూస్తోంది. అయితే పార్టీలను మాత్రం పోలింగ్ శాతం టెన్షన్ పెడుతోంది.
Delhi Election Results 2025
Updated on: Feb 08, 2025 | 6:46 AM
హస్తినతో పాటు దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు రిటర్నింగ్ అధికారిని నియమించారు. 19 కౌంటింగ్ కేంద్రాల దగ్గర 10 వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి భద్రత సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతి ఇస్తారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారిని బయటకు అనుమతించరు.
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను ఉదయం 7 గంటలకు.. ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారి ఓపెన్ చేస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో నమోదు అయిన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలో ఈ నెల 5న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు బీజేపీ, ఆప్ మధ్యే ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. అధికారం సాధించాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాలి. వరుసగా నాలుగో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆప్ నేతలు చెబుతుంటే.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికార పీఠం దక్కించుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయిన కాంగ్రెస్ మాత్రం.. ఈ సారి ఖాతా తెరుస్తామని చెబుతోంది.
న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. 2013 నుంచి కేజ్రీవాల్‌కు ఇక్కడ ఓటమే లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక కాల్కాజీ నుంచి ముఖ్యమంత్రి ఆతిషి బరిలో నిలవగా.. కాంగ్రెస్ పార్టీ ఆల్కా లాంబాను బరిలో దించింది. బీజేపీ మాత్రం వివాదాస్పద నేత రమేశ్ బిదూరికి టికెట్ ఇచ్చింది. ఇక జంగ్‌పురా నుంచి తొలిసారి మనీశ్ సిసోడియా బరిలో ఉన్నారు. బీజేపీ తరపున తార్వీందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేస్తున్నారు. ఇక ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ఓక్లాలో మజ్లిస్ కూడా బరిలో నిలవడంతో ఇక్కడ ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ కోసం టీవీ9ను ఫాలో అవ్వండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..