బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీల నిర్వహణకు ప్రతి ఒక్కరూ పిన్ నంబరు పెట్టుకుంటారు. అయితే ఈ డిజిటల్ యుగంలో ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటి నుంచి రక్షణకు యాక్సింగ్ బ్యాంకు కొత్త విధానం తీసుకువచ్చింది. సురక్షితమైన బ్యాంకింగ్ కోసం దేవనాగరి పిన్ ను ప్రారంభించింది. దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. వీటి ద్వారా ఆన్ లైన్ లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పిన్ నంబర్ పెట్టుకుంటారు. చాలామంది తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పిల్లల పేర్లు, సులువుగా ఉండే నంబర్లతో దీన్ని సెట్ చేసుకుంటారు. లావా దేవీల సమయంలో గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ పద్ధతిని ఫాలో అవుతారు. కానీ ఇదే సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. చాలా తెలివిగా మన పిన్ నంబర్ ను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలలో డబ్బులను దోచుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కరానికే దేవనాగరి పిన్ విధానం అమల్లోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్ల సమస్యకు యాక్సిస్ బ్యాంకు ప్రత్యేక పరిష్కారంతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా దేవనాగరి పిన్ ను ఆవిష్కరించింది. సాంకేతికత, సంప్రదాయాన్ని మిళితం చేసి దీన్ని తీసుకువచ్చింది. ఈ పిన్ ను గుర్తుంచుకోవడానికి ఖాతాదారులకు వీలుగా ఉంటుంది. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు ఛేదించలేరు. దేవనాగరి పిన్ ను సెట్ చేసుకునేందుకు ముందుగా దేవనాగరిపిన్.కమ్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి. మీ ఖాతాకు సెట్ చేసుకునే పేరును ముందుగానే నిర్ణయించుకోవాలి. అది మీకిష్టమైన పుస్తకం, రుచికరమైన వంటకం, సినిమా.. ఇలా ఏదైనా కావచ్చు. వెబ్ సైట్ లో ఆ పేరు టైప్ చేయడానే మీ పిన్ సెట్ అవుతుంది. ఈ విధానంలో మీరు టైప్ చేసిన పదాలు అల్ట్రా సురక్షిత పిన్ లుగా మార్చబడతాయి. దీన్ని సైబర్ నేరగాళ్లు ట్రాక్ చేయలేరు.
ఊహాజనిత సంఖ్యల పిన్ నంబర్ ను సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా హ్యాక్ చేయగలరు. దేవనాగరి లిపి విషయంలో ఆ అవకాశం ఉండదు. మన ఖాతాలు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో విపరీతంగా జరుగుతున్న సైబర్ మోసాలకు ఇదే చక్కటి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. భారతీయులకు డిజిటల్ భద్రతను పెంపొందించే చర్యలలో భాగంగా కొత్త పిన్ నంబర్ విధానాన్ని యాక్సిస్ బ్యాంకు తీసుకువచ్చింది. దీని ద్వారా పుట్టిన తేదీలు, వార్షికోత్సవాలు, ఇతర ఊహాజనిత పిన్ నంబర్లకు టాటా చెప్పేయ్యండి. వినియోగదారులు పేర్లు, ఇష్టమైన మంత్రాలు, స్థలాలను ఎంపిక చేసుకుని దేవనాగరి.కమ్ లో ఎంటర్ చేయాలి. తద్వారా అది ప్రత్యేకమైన పిన్ గా మారుతుంది. ఆ నంబర్ ను బ్యాంకు లావాదేవీల కోసం చక్కగా వినియోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి