సాధారణంగా రెగ్యలర్‌గా షుగర్ టెస్ట్ చేసుకునేవారు... 'ప్రికింగ్' పద్దతిని ఫాలో అవుతారు. అంటే.. చేతి మొనలపై సన్నని సూది గుచ్చి రక్తాన్ని సేకరిస్తారు. ఆ సమయంలో భయంకరమైన పెయిన్ ఉంటుంది. ఇలా రోజూ అంటే ఇబ్బంది. అయితే అలాంటి ఇబ్బంది లేకుండా ఈజీ విధానంలో కూడా షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు.
Diabetes Test
జనరల్‌గా షుగర్ టెస్ట్ చేసేటప్పుడు.. ‘ప్రికింగ్’ విధానాన్ని అనుసరిస్తారు. అంటే బ్లడ్ కోసం చేతి వేలికి సన్నని సూది గుచ్చుతారు. రోజు ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకునేవారు ఈ విధానాన్ని అనుసరిస్తారు. ఆ సమయంలో కొందరు బాగా పెయిన్ ఫీల్ అవుతారు. కారణం మన ఫింగర్స్ సెన్సిటివ్ ప్లేసులో సూదిని గుచ్చుతాం. అయితే అంత ఇబ్బంది పడాల్సిన పనిలేదట. దాని కోసం ఓ ఈజీ వే ఉందని డాక్టర్స్ చెబుతున్నారు.
షుగర్ టెస్ట్ సమయంలో సూదిని గుచ్చేటప్పుడు మీ చేతులను నమస్తే భంగిమలో ఉంచి.. ఫింగర్స్ సైడ్ నుంచి గుచ్చితే.. అసలు పెయిన్ ఉండదట. అంతేకాదు యోగాలో గల వివిధ రకాలు చేతి ముద్రలు పెట్టి.. ఫింగర్స్ సైడ్ బోర్డర్స్ వద్ద సూది గుచ్చితో కూడా నొప్పి అనేది చాలా తక్కువగా ఉంటుందట. అసలు ప్రికింగ్ విధానం మా వల్ల కాదు బాబోయ్ అని మీరు అనుకుంటే.. మరో ఆప్షన్ కూడా ఉంది. నిరంతరం మన బాడీలో గ్లూకోజ్ మానిటర్స్ (CGMs) వంటి పరికరాలను మీ శరీరంపై అటాచ్ చేస్తే అవి.. 24/7 రక్తంలో షుగర్ స్థాయిలను మానిటర్ చేసి రిపోర్ట్ ఇస్తాయి. నిద్రపోతున్నప్పుడు కూడా వీటిని ఉంచుకోవచ్చు. ఈ పరికరాల కోసం కొంత ఖర్చు అవుతుంది. నొప్పి లేకుండా ఉండాలంటే తప్పదు మరి.