Emergency Movie: కంగనాకు భారీ ఊరట.. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్.. రిలీజ్ ఎప్పుడంటే?

2 hours ago 1

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహించి, నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ సినిమా వివాదాలకు కేంద్రంగా కూడా నిలిచింది. సెన్సార్ బోర్డు కూడా సర్టిఫికెట్ జారీ చేసేందుకు నిరాకరించింది. దీంతో కంగనా సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడీ కాంట్రవర్సీ మూవీ రిలీజ్ విషయంలో అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఎట్టకేలకు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను కంగనా పంచుకుంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ ఘటనలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసిన కంగనా ‘ఎమర్జెన్సీ’ సినిమా చేసింది. ఈ చిత్రంలో ఆమె ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ సినిమా కోసంఆమె చాలా కష్టపడ్డారు. అయితే సెన్సార్ బోర్డు మాత్రం సినిమాలో చాలా మార్పులు చేర్పులు సూచించింది. అందుకు ఒప్పుకోకుంటే తప్ప సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేం’ అని ఘాటుగా చెప్పేసింది. దీంతో సెన్సార్ బోర్డ్ ఇచ్చిన సూచనలను పరిశీలిస్తామని చిత్రబృందం పేర్కొంది. అదేవిధంగా, ఇప్పుడు టీమ్ మార్పులకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ సినిమాకు తాజాగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను కంగనా తన అభిమానులతో పంచుకుంది.

‘మా చిత్రం ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ లభించిందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ ఓపిక, ద్దతుకు ధన్యవాదాలు’ అని కంగనా ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలవుతుందా లేక వచ్చే ఏడాది వరకు వెయిట్ చేస్తుందా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ‘ఎమర్జెన్సీ’ సినిమాపై సిక్కు సమాజం మండిపడింది. ఈ సినిమాలో సిక్కు వర్గాన్ని కించపరిచారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం కోర్టుకు కూడా చేరింది.

ఇవి కూడా చదవండి

కంగనా ట్వీట్..

We are gladsome to denote we person received the censor certificate for our movie Emergency, we volition beryllium announcing the merchandise day soon. Thank you for your patience and enactment 🇮🇳

— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్..

Meri movie mein sabse important hai desh bhakti ka gaana 🙂 Here it is.. pic.twitter.com/PlLblEuQRY

— Kangana Ranaut (@KanganaTeam) August 31, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article