మైగ్రేన్.. ఇటీవలి కాలంలో చాలా మందిని వేధిస్తున్న సాధారణ సమస్య. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఇది తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. నీరసం, వాంతులు, అలసట వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఒక రోజు నుండి రెండు మూడు రోజుల పాటు ఈ తలనొప్పి వేధిస్తూ ఉంటుంది. అయితే, మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు తమ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల మంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Updated on: Feb 08, 2025 | 12:10 PM
సరైన ఆహారం తీసుకోవడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ తగ్గుతుందని.. ఒత్తిడి, టెన్షన్ కారణంగా కానీ హార్మోనల్ మార్పుల వల్ల కానీ నొప్పి వస్తుందని అంటున్నారు. అయితే ఆహారం నిజంగా ఎంతో మార్పు తీసుకు వస్తుందని తలనొప్పి తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
1 / 5
విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్ రాకుండా చూసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తలనొప్పి, మైగ్రేన్ తో బాధపడే వారు తప్పనిసరిగా తమ డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని చెబుతున్నారు.
2 / 5
ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య తొలగిపోతుంది. ముఖ్యంగా పాలకూరలో ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. అలానే ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం ఉంటుంది. ఆకు కూరలు తినడం వల్ల మైగ్రేన్ సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
3 / 5
సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మైగ్రేన్ నొప్పిని తొలగిస్తుంది. అదే విధంగా సీ ఫుడ్, నాన్ స్టార్చి వెజిటేబుల్స్, గుడ్లు కూడా డైట్ లో తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తలనొప్పి లేదా మైగ్రేన్ తో బాధపడే వాళ్ళు హైడ్రేట్ గా ఉండాలని కనీసం రోజుకు 8 నుండి 10 గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు.
4 / 5
మెగ్నీషియం సమృద్ధిగా ఉండే డ్రై నట్స్ ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని కారణంగా మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. మీరు ప్రతిరోజూ బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, గుమ్మడి గింజలని స్నాక్స్ కింద తీసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది తగ్గుతుంది.
5 / 5