భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను గ్రామంలో ఒక బోర్ నుంచి మోటార్ లేకుండానే నీరు ఉబికివస్తుంది. 50 ఏళ్ల క్రితం గ్రామస్తులకు నీటి ఎద్దడి ఉండడంతో మంచినీటి కోసం అధికారులు బోరు వేయించారు. అయితే బోరు వేసిన నాటి నుండి మోటారు సహాయం లేకుండా 2 హార్స్ పవర్ మోటర్ వేస్తే ఎంత వాటర్ వస్తుందో అంత ధార… మోటార్ లేకుండానే వస్తుంది. అది చూసిన గ్రామస్తులంతా ఆ రోజుల్లో ఆశ్చర్యంగా తిలకించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. నీటిని నిరంతరం వినియోగించుకుంటున్నా… అందులో నీరు తగ్గడం మాత్రం జరగడం లేదు. ఈ బోరు గ్రామ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. పక్కనే ఉన్న ఆశ్రమ స్కూలులో 300 మంది విద్యార్థులకు ఈ నీరు ఉపయోగిస్తున్నారు. ఈ గ్రామ రైతులు కూడా ఈ నీటితో పంటలు పండించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ బోరు బావి 50 ఏళ్ల క్రితం నుండి మోటార్ సహాయం లేకుండా బోరు నుంచి నీరు ఉబికిరావడం విశేషం. ఇప్పటికీ దారి వెంట పోయే వాళ్లంతా కూడా ఈ బోరును ఆసక్తికరంగా తిలకిస్తూ ఉంటారు. దాని గురించి చాలా గొప్పగా చెబుతుంటారు ఈ గ్రామస్తులు. నేటి తరం పిల్లలైతే తమ తాత ముత్తాతల నుండి ఈ బోరు ఇలానే నీళ్లె పోస్తుందని చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..