Gold Prices Surge: తులం బంగారం రూ.లక్ష.? 2004లో దాదాపు రూ.6300.. కానీ ఇప్పుడు.?

2 hours ago 1

10 గ్రాముల బంగారం లక్ష రూపాయిలు. ఈ మాట వింటేనే గుండె కలుక్కుమంటుంది. నిపుణులు, ఆల్రెడీ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79 వేల మార్కును టచ్ చేసింది. ఇక ఇది దీపావళి, ధన్ తేరస్ వంటి పండుగల సీజన్. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా నడుస్తోంది. ఇంకేముంది.. పసిడి పరుగుకు కళ్లెం వేయడానికి అవకాశమే లేకుండా పోయింది. అంతర్జాతీయంగా చూస్తే.. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ఉంది. అటు చైనా ఏమో.. తైవాన్ ను భయపెడుతోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ సంగతీ తెలిసిందే. ఇంకా అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా నవంబర్ నెలలో ఉన్నాయి. దాని ఫలితాలు కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయి. అంటే దేశీయంగా ఉన్న పరిస్థితులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, సామాజిక సంక్షోభాలు కూడా బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి. గత 20 ఏళ్లలో పుత్తడి ధర పెరిగిన తీరు చూస్తే.. బాబోయ్ అనాల్సిందే. అంతలా పెరిగిపోయింది. 2004లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 6 వేల 300 వందలు. ఇప్పుడు దాదాపు 79 వేల రూపాయిలు.

ఇక ఈ సంవత్సరాంతానికి 10 గ్రాముల పుత్తడి ధర లక్ష రూపాయిలు అవుతుందా? పెరగడం అయితే పక్కా. కాకపోతే ఇప్పుడే లక్ష అవుతుందని చెప్పలేం. కాకపోతే 80 వేల ధర దగ్గర దీని జోరుకు కాస్త బ్రేకులు పడే అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ తొలి వారంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందేమో అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అందుకే చాలామంది తమ మదుపును బంగారం మీదకు మళ్లించారు. దీంతో గోల్డ్ రేటు పెరిగింది. ఇక నవంబర్ లో అమెరికా ఫెడరల్ పాలసీని బట్టి మళ్లీ బంగారం ధరపై ప్రభావం ఉంటుంది. అయితే అప్పుడు రేటు ఎంత పెరుగుతుంది అన్నది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు నిపుణులు. కానీ ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా బంగారాన్ని కొనడానికి ఇది మంచి సమయమే అని మాత్రం చెప్పగలుగుతున్నారు. బంగారాన్ని కొనాలంటే సామాన్య, మధ్యతరగతి వారికి ఇప్పుడు తలకు మించిన భారం. 10 గ్రాముల గోల్డ్ కు 70వేలకు పైగా మదుపు పెట్టి.. దానికి జీఎస్టీ అదనంగా కట్టి.. మజూరీ ఛార్జీలు చెల్లించి.. అబ్బో.. మొత్తం ఖర్చు చూస్తే.. తడిసి మోపెడు అవుతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? ఉద్యోగస్తులైతే.. నెల నెలా కాని, ఏడాదికోసారో లేదా పండగల సమయంలో కాని బంగారాన్ని కొంటారు. అలా దేశం మొత్తం మీద ఇప్పటివరకు కుటుంబాలు కొన్న.. వాటి దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా? అది.. 25 వేల టన్నులకు పైగా ఉంటుంది. దీనికి విలువ కడితే.. 126 లక్షల కోట్ల రూపాయిలు అవుతుంది. అదీ భారతీయుల గోల్డ్ సత్తా. సాధారణంగా మనవాళ్లు బంగారాన్ని మదుపు మార్గంగానే చూస్తారు. కష్టకాలంలో కుదవ పెట్టి డబ్బులు తెచ్చుకోవడానికైనా ఉంటుందన్న భరోసాతో దీనిని కొనడానికి ఇష్టపడతారు. ఇక పెళ్లి సమయంలో అమ్మాయి తరపువారు.. లాంఛనాలతో పాటు కచ్చితంగా ఎంతోకొంత బంగారం పెడతారు. అదయితే.. తమ ఇంటి ఆడపిల్ల దగ్గరే ఉంటుందని ఆపత్కాలంలో ఆదుకుంటుందని వారి నమ్మకం. అందుకే మన దేశంలో పుత్తడికి అంత డిమాండ్ ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article