పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ఒక్కోసారి ధరలు తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. మీరు బంగారం కొనాలా? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇలా..
Gold Silver Price
భారతీయుల్లో బంగారంపై మోజు…అది ఎప్పటికి తగ్గని క్రేజు. ఒక రకంగా చెప్పాలి అంటే గోల్డ్ అనేది మనవాళ్లకు ఓ ఎమోషన్. ఇప్పుడు మంచి ఇన్వెస్ట్‌మెంట్ సోర్స్‌గా కూడా మారిపోయింది గోల్డ్. దీంతో బంగారానికి గిరాకీ అంతకంతకూ పెరిగిపోతుంది. వచ్చే నెల ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కేంద్రం కస్టమ్స్ సుంకాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇంకా గోల్డ్ రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు జనవరి 22న ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్: క్రితం రోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.150 పెరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ ఓ 10 రూపాయలు తగ్గి లేకుండా తులం గోల్డ్ రేటు రూ. 74,500 వద్ద ట్రేడవుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గ్రాముకు రూపాయి చొప్పున తగ్గి రూ.81,220గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.93,870గా ఉంది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,490 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.81,220గా ట్రేడ్ అవుతోంది.
అయితే, ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన బంగారం ధరలు బుధవారం ఉదయం సమయంలో ఉన్నవి. టైం గడుస్తోన్న కొద్దీ గోల్డ్, సిల్వర్ రేట్లలో మార్పు రావచ్చు. ప్రాంతాలను బట్టి ధరల్లో తారతమ్యాలు ఉంటాయి. కొనుగోలు చేసే ముందు మరోసారి చెక్ చేసుకోవడం బెటర్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి