అనకాపల్లి జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు బయలుదేరారు.. ఒక్కొక్కరికి ఒక్కో రకం చేపలు పడ్డాయి.. కొందరికి వంజరాలు.. మరికొందరికి రాయి చేపలు.. కానీ ఓ మత్స్యకారుడికి మాత్రం పంటపండింది.. ఏకంగా కచిడి చేప గేలానికి చిక్కడంతో ఇక ఎగిరి గంతేశాడు.. అనకాపల్లి జిల్లా పూడిమడకలో వేటకు వెళ్లారు మత్స్యకారులు.. అచ్యుతాపురం మండలం సముద్రంలో వేట చేస్తూ ఉన్నారు. పూడిమడక మత్స్యకారులకు వంజరం, రాయి చేపలు పడ్డాయి.. కానీ జాలారిపాలేనికి చెందిన మత్స్యకారునికి మాత్రం కచిడి చేప చిక్కింది.
14 కిలోల బరువు ఉన్న ఈ చేపను వాటిని చూడగానే మత్స్యకారూలు ఎగిరి గంతేశారు. ఒడ్డుకు ఆ చేపను తీసుకొచ్చారు. అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు ఆ చేపలను కొనేందుకు పోటీపడ్డారు. చివరకు ఈ చేపను ఒకరు 28వేలకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు మత్స్యకారులు.. దీని కోసం చాలా మంది పోటీ పడ్డారని తెలిపారు.
రుచి.. ఔషధ గుణాలు..
కచిడి చేపలు బంగారు వర్ణంలో ఉంటాయి. చూసేందుకు ఆకట్టుకుంటాయి. అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా అంటారు. మగ చేపలు అయితే నిగనిగా లాడుతూ కనిపిస్తాయి. రుచి మామూలుగా ఉండదు మరి.. ఔషధ గుణాలు కూడా ఎక్కువే అంటున్నారు మత్స్యకారులు. కొన్ని రకాల మందుల్లో కూడా వీటి అవశేషాలు వాడతారని చెబుతున్నారు. అంతేకాదు సర్జరీ చేసిన తర్వాత వేసే కుట్ల కోసం ఈ చేప నుంచి వచ్చే పదార్థంతో తయారు చేస్తారట. ఈ చేప రెక్కలను మరికొన్ని పదార్థాలు ప్రాసెసింగ్ చేసేందుకు వినియోగిస్తారని కూడా మరి కొంతమంది చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..