తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయన్నారు. అయితే, సమర్థులు అమెరికాలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో మీడియాకు తెలిపారు. ‘ఈ అంశంపై నాకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి. సమర్థవంతులైన వ్యక్తులు మన దేశంలోకి రావడాన్ని నేనూ ఇష్టపడతాను. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే నేను మాట్లడటం లేదు. అన్ని స్థాయిల వ్యక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెబుతున్నా. దేశంల వ్యాపారరంగాన్ని విస్తరించేందుకు మాకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది హెచ్1బీ వీసాతో సాధ్యమవుతుంది. అందుకే నేను రెండు వాదనలనూ సమర్థిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు వచ్చేందుకు హెచ్1బీ వీసా ఉపయోగపడుతోందని ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భిన్నమైన వాదనను వినిపించారు. ‘నేను సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నిరుద్యోగం రేటు 11 శాతం నుంచి 4 శాతానికి పడిపోయింది. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఇప్పుడు విమానాలు, ఆటోమొబైల్స్ తయారీలో రాణిస్తున్నారు. సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టిసారించాలి. అంతేకానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దు’ అని స్పష్టంగా తన అభిప్రాయాన్ని వినిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభమేళాలో రష్యన్ బాబా.. ఈయన బ్యాగ్రౌండ్ ఇదే..
తేనెకళ్ల సుందరికి బంపర్ ఆఫర్ బాలీవుడ్ సినిమాలో ఛాన్స్..
Donald Trump: ట్రంప్ దూకుడు.. ఆ ఉద్యోగులందరికీ లే ఆఫ్‌లు..
ఫ్రెండ్ ఫ్రెండే.. బిజినెస్ బిజినెస్సే.. ఇండియాతోనూ ట్రంప్ ట్రేడ్ వార్ ??