Horoscope Today: వారికి సానుకూలంగా ఆర్థిక వ్యవహారాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

3 hours ago 3

దిన ఫలాలు (జనవరి 31, 2025): మేష రాశి వారు ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు. మిథున రాశి వారికి ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాల వల్ల బాగా కలిసి వస్తుంది. పెండింగ్ పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులు ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఆర్థికపరంగా శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా, లాభసాటిగా సాగిపో తాయి. ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యో గంలో పనిభారం, బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేస్తారు. ఇంటా బయటా కొద్దిపాటి అనుకూలతలు కలుగుతాయి. ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలు కొద్ది ప్రయత్నతో పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలను పంచుకో వాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు అందుకుంటారు. ఆర్థిక వాతావరణం బాగా అను కూలంగా ఉంటుంది. ఇంటా బయటా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్య మైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. నిరుద్యో గులకు అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరు గుతుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కా రమయ్యే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడతారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సాను కూల వాతావరణం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నమైనా సంతృ ప్తికరంగా నెరవేరుతుంది. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. విదేశాల్లో ఉంటున్న పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా, సానుకూలంగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు చదు వుల్లో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరిగే అవకాశముంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. ఎక్కువగా ఆధారపడే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఫలితం తక్కువగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు సవ్యంగా సాగిపోతాయి. ఇంటా బయటా ఒత్తిడి, శ్రమ తిప్పట ఉంటాయి. మిత్రులకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం నిల కడగా ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభి స్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు ఎదురుండదు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థికపరంగా రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా గౌరవమర్యాద లకు లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెడతారు. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్నిముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అవనసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article