Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

3 hours ago 1

దీపావళి పండుగ అంటేనే పటాకులు పేలాల్సిందే. కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి మొదలుపెట్టి.. థౌసెండ్ వాలాలు, లక్ష్మీబాంబులు ఇలా పేర్లు ఏవైనా.. మోత మోగిపోవాల్సిందే. ఇటు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టు. పండుగ రోజే కాదు.. దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి వరకు ఈ మోత మోగుతూనే ఉంటాయి…

ఇలాంటి సంబరంలో పోలీసులు ఆంక్షలు పెట్టారన్న పుకారు ఇప్పుడు తెలుగు జనాలను ఆందోళనలో పడేసింది. క్రాకర్స్ కాల్చటంపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు పెట్టారని.. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. పలు నిబంధనలు పెట్టారంటూ నెట్టింట ఓన్యూస్ వైరల్ అయింది. పండుగరోజు రెండు గంటలు మాత్రమే అదీ 8నుంచి 10గంటల వరకే క్రాకర్స్ కాల్చాలన్న నిబంధనలు పెట్టారని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇవన్నీ పుకార్లేనని పోలీసుల నుంచి క్లారిటీ వచ్చింది. హైదరాబాద్‌లో దీపావళి పండుగపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.

This is conscionable to clarify that this notification has thing to bash with the Deepawali festival celebrations. There are immoderate different groups of radical who are readying assorted types of agitations , astonishment raids connected secretariat , CMs residence , DGP bureau ,Rajbhavan etc .We have… https://t.co/wnjc1qNuqw

— CV Anand IPS (@CVAnandIPS) October 28, 2024

మరోవైపు హైదరాబాద్‌ అబిడ్స్‌ పరిధిలోని బొగ్గుల కుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారాస్‌ బాణాసంచా దుకాణంలో జరిగిన పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్‌కు మంటలు వ్యాపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రాత్రి విక్రయాలు జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. పారాస్ దుకాణం పర్మిషన్ ఇచ్చిన చోటు కాకుండా మరోచోట పెట్టినట్లు అధికారులుగుర్తించారు . ఇలా నిబంధనలు అతిక్రమించే షాపులకు ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. టపాసు దుకాణాలకు పలు నిబంధనలతో కూడిన సర్క్యులర్ జారీ అయింది. ఓపెన్ ప్లేసుల్లో మాత్రమే దుకాణాలు తెరవాలని…పిల్లలను అనుమతించకూడదని తెలిపింది. ప్రతి ఫైర్ షాపు దగ్గర 200 లీటర్స్ వాటర్ డ్రమ్ములు, బకెట్స్ కచ్చితంగా ఉండాలని ఆదేశించింది.

టపాసు దుకాణాలపై ఆంక్షలు తప్ప…పండుగ జరుపుకునే విషయంలో ఎలాంటి కండీషన్స్ లేవు. అయితే దేశవ్యాప్తంగా పలుచోట్ల దీపావళిపై ఆంక్షలున్నాయి. కాలుష్యం విపరీతంగా ఉండే ఢిల్లీ లాంటి ప్రదేశంలో కోర్టు గైడ్‌లైన్స్ తప్పకుండా పాటించాలన్న నిబంధన ఉంది. ఢిల్లీలో క్రాకర్స్ కాల్చటం టోటల్‌గా నిషేధం. అక్కడ అమ్మకూడదు..కొనకూడదు. కొన్ని ప్రాంతాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం.. 55 డెసిబెల్స్ మించి శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చకూడదు. అలాగే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని , అమ్మాలన్న నిబంధన కూడా ఉంది. సో..హైదరాబాద్‌లో ఎలాంటి ఆంక్షలు లేవు..కానీ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుని పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా గ్రీన్ క్రాకర్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని పర్యావరణ వేత్తలు సూచన.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article