ఐదో టీ20 మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కు ముందే సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా గెలుచుకుంది. అయితే ఐదో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ కు ఘనమైన ముగింపు పలకాలని టీమిండియా భావించింది. అందుకే తగ్గట్టుగానే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అతడి బ్యాటింగ్ జోరు కొనసాగింది.. ఓవరాల్ గా అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.అయితే భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కు శుభారంభమే లభించింది. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు.అయితే భారత బౌలర్లు ఉన్నట్లుండి విజృంభించడంతో వరుసగా వికెట్లు పడ్డాయి. దీంతో 10.3 ఓవర్లలోనే ఇంగ్లండ్ 97 పరుగులకు కుప్పకూలింది. భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ తరఫున ఫిలిప్ సాల్ట్ బాగా ఆడాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. అయితే మహ్మద్ షమీ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చాడు. అలాగే వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అభిషేక్ శర్మ లు తలా 2 వికెట్ల తీసి ఇంగ్లండ పతనాన్ని శాసించారు.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుంది. 2012 నుంచి ఈ రెండు జట్లు టీ20 సిరీస్‌లు ఆడుతున్నాయి. అయితే అప్పటి నుంచి ప్రతిసారి టీమ్ ఇండియా చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతూనే ఉంది. భారత్‌లో సిరీస్ అయినా, ఇంగ్లండ్‌లో జరిగినా..ప్రతిసారీ భారత జట్టునే విజయం వరిస్తోంది.
ఇవి కూడా చదవండి
An awesome mode to wrapper up the bid 🤩#TeamIndia triumph the 5th and last T20I by 150 runs and triumph the bid by 4-1 👌
Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX
— BCCI (@BCCI) February 2, 2025
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..