IP69 smartphones: ఈ ఫోన్లు ఉంటే వానలోనూ హాయి.. మార్కెట్‌లో బెస్ట్ ఐపీ69 రేటెడ్ స్మార్ట్ ఫోన్లు

3 hours ago 1

ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రత్యేకతలతో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. స్క్రీన్, కెమెరా, బ్యాటరీ, చిప్.. ఇలా అన్నింటిలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఐపీ69 రేటెడ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుంది. దీని వల్ల దుమ్ము, దూళి, నీరు నుంచి ఫోన్లకు రక్షణ లభిస్తుంది. భారీ వర్షంలో, షవర్ కింద, జలపాతం దగ్గర కూడా ఎలాంటి కంగారు లేకుండా ఉండవచ్చు. ఫోన్ లోకి నీరు, దమ్ము చేరే అవకాశం అస్సలు ఉండదు. ఈ ఐపీ 69 రేటెడ్ ఫోన్లు వన్ ప్లస్ నుంచి పోకో వరకూ వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Srinu

|

Updated on: Jan 22, 2025 | 4:15 PM

పోకో ఎక్స్7 ప్రో స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, గోరిల్లా గ్లాస్ 7ఐ, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్‌ అమర్చారు.  ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ ఆధారంగా హైపర్‌ఓఎస్ 2తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే.  50 ఎంపీ ప్రైమరీ షూటర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ బాగున్నాయి. 90 డబ్ల్యూ చార్జర్ కు మద్దతు తెలిపే 6,550 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ రూ.27,999కు అందుబాటులో ఉంది.

1 / 5

ఒప్పో ఫైండ్ ఎక్స్8 స్మార్ట్ ఫోన్ లో 6.59 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, మీడియాటెక్  డైమెన్సిటీ 9400 చిప్ సెట్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం 193 గ్రాముల బరువు, అల్యూమినియం ఫ్రేమ్‌ కలిగిన ఈ ఫోన్ లో 80 డబ్ల్యూ వైర్డు,  50 డబ్ల్యూ వైర్‌లెస్ చార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,630 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 3 ఎక్స్  ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్ రూ.69,999కు అందుబాటులో ఉంది.

2 / 5

వన్ ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ లోని 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కారణంగా చార్జింగ్ సమస్య ఉండదు. దాదాపు రెండు రోజుల పాటు చార్జింగ్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్, 6.82 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌, సిరామిక్ గార్డ్ గ్లాస్‌ రక్షణ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 15తో రన్ అయ్యే ఈ ఫోన్‌కు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి. 50 ఎంపీ ప్రైమరీ, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్,  50 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. అమెజాన్‌లో రూ. 69,998 నుంచి ఈ ఫోన్ ధర ప్రారంభమవుతుంది.

3 / 5

తక్కువ ధరలకు లభించే బెస్ట్ ఫోన్లలో ఒప్పో రెనో 13 ఒకటి. దీనిలో డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ ఏర్పాటు  చేశారు. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు చక్కగా తీసుకోవచ్చు. 4కేలో 30 ఎఫ్ పీఎస్ వద్ద వీడియోలను రికార్డ్ చేయవచ్చు. దీనిలో ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 80 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ రూ. 37,999కు అందుబాటులో ఉంది.

4 / 5

రంగులు మార్చే కొత్త టెక్నాలజీని ఈ ఫోన్ లో తీసుకువచ్చారు. 16 డిగ్రీల కంటే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఈ ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుంచి బ్ల్యూ రంగులోకి మారుతుంది. స్నాప్ డ్రాగ్ 7 ఎస్ జెన్ 3 చిప్‌సెట్, 6.83 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌, గొరిల్లా గ్లాస్ 7ఐ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 12 జీబీ ర్యామ్, 256 జీబీ  స్టోరేజ్, వెనుక భాగంలో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 8 ఎంపీ అల్ట్రావైడ్ షూటర్‌, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. దీనిలోని 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని 80 డబ్ల్యూ వైర్డు ఛార్జర్ తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ లోని 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ రూ.29,999కు అందుబాటులో ఉంది.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article