IPL 2025 మెగా వేలంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అయితే మెగా వేలంకు సంబంధించి RTM అనే పదం మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తోంది. RTM, ఇది రైట్ టు మ్యాచ్ అని దీని అర్థం. వేలంలో అత్యధిక బిడ్‌తో సరిపోలడం ద్వారా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త RTM సిస్టమ్ ఎలా పని చేస్తుంది, దాని నియమాలు ఏమిటి..? ఏయే ప్రాంచైజీలు RTM పవర్ కలిగి ఉన్నాయి, ఏజట్టు ఎంత మేరకు ఉపయోగించనుంది అనేది ఓసారి పరిశీలిస్తే..
RTM అంటే ఏమిటి:
IPL లో పాల్గొనే జట్లకు ఇప్పుడు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతి ఉంది. జట్లు రెండు ప్రాథమిక పద్ధతుల ద్వారా ఆటగాళ్లను నిలుపుకునే అవకాశముంది. వేలం ముందు పూర్తిగా నిలుపుదల(రెటైన్), లేదా వేలం సమయంలో రైట్-టు-మ్యాచ్ (RTM) ఎంపికలను ఉపయోగించడం ద్వారా.
RTM నియమాలు:
- జట్లు రిటైన్ చేసే 6 మంది ఆటగాళ్లలో 5 మంది క్యాప్డ్, ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు.
- వేలం సమయంలో ఆటగాళ్లపై ఇతర జట్లు అత్యధిక బిడ్ పెట్టినప్పటికీ, అసలు జట్టు ఆ బిడ్‌తో సంబంధం లేకుండా ఆటగాడిని తిరిగి పొందవచ్చు.
ఈ కొత్త సిస్టమ్ రాబోయే సీజన్ కోసం జట్లకు వారి కూర్పును సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
RTM వ్యవస్థ నిబంధనల ప్రకారం, వేలం సమయంలో ఇతర జట్లకు విక్రయించబడిన ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయడానికి జట్లకు అవకాశం ఉంటుంది.
నిబంధనల ప్రకారం, మెగా వేలంలో ఒక ప్లేయర్‌ని మరొక ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్లయితే, అతను IPL 2024లో భాగమైన ఫ్రాంచైజీ బిడ్డింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి రంగంలోకి దిగి, RTM కార్డును ఉపయోగించి వారి ఆటగాడిని తిరిగి అత్యధిక బిడ్ తో కొనుగోలు చేయవచ్చు.
దీనర్థం, ఒక జట్టు మరొక జట్టు నుండి ఆటగాడికి అత్యధిక మొత్తంలో వేలం వేస్తే, ఆ బిడ్‌తో(అదే ప్రైస్ కి) ఆటగాడిని పొందవచ్చు.
అసలు జట్టు బిడ్‌తో సరిపోలితే, కొత్త జట్టు తమ బిడ్‌ను పెంచుకోవడానికి మరొక అవకాశం ఉంది. అప్పుడు కూడా అసలు జట్టు తమ ఆటగాడిని కొనసాగించడానికి కొత్త, అధిక బిడ్‌తో సరిపోలాలి.
పంజాబ్ కింగ్స్ కి 4 RTM అవకాశాలు
పంజాబ్ కింగ్స్ (PBKS) అత్యంత (4) రైట్-టు-మ్యాచ్ (RTM) ఎంపికలతో వేలంలోకి వెళుతోంది. పైన వివరించినట్లుగా, RTMలు జట్లు తమ మునుపటి స్క్వాడ్‌ల నుండి ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతిస్తాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మూడు RTMలు ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు రెండు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తో సహా లక్నో సూపర్ జెయింట్స్ – ఒక్కొక్కటి RTM ఎంపికను కలిగి ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు ఒక్క RTM ఎంపికలు కూడా లేవు.
RTM వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తున్నప్పటికీ, సాధారణ బిడ్డింగ్ ద్వారా జట్లు ఇప్పటికీ ఆటగాళ్లను పొందవచ్చు. “వేలంలో సాధారణ బిడ్డింగ్ సమయంలో వారి కోసం అత్యధిక బిడ్‌లను ఉంచినట్లయితే, ఫ్రాంచైజీ తిరిగి కొనుగోలు చేయగల ఆటగాళ్ల సంఖ్యపై ఎటువంటి పరిమితి ఉండదు”.