IPL 2025 Auction: 2025 ఎడిషన్‌కు ముందు జరిగే ఇండియా ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో 577 మంది ఆటగాళ్లు టోర్నమెంట్ కోసం తమ స్క్వాడ్‌లను సిద్ధం చేయాలని చూస్తున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలోని అబాడి అల్-జోహార్ అరేనాలో వేలం జరగనుంది. 84 మంది క్రికెటర్లను వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ ఆదివారం వేలంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. రెండు రోజులలో మొత్తం 331 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు వేలానికి రానున్నారు. అసోసియేట్ దేశాల నుంచి కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే జాబితా చేశారు.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరు?
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ అవేశ్ ఖాన్. అతను ఎవరూ ఊహించని బిడ్‌ను రూ. 10 కోట్లను దక్కించుకున్నాడు. IPL 2022 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ మొత్తం ఖర్చు చేసింది.
PL 2025 వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు:
అన్‌క్యాప్ ఆటగాళ్ల సంఖ్య | 331 |
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల అత్యల్ప బేస్ ధర | 30 లక్షలు |
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల అత్యధిక బేస్ ధర | 50 లక్షలు |
ఈ క్రమంలో అవేశ్ ఖాన్ జట్టు తరపున 22 మ్యాచ్‌ల్లో ఆడాడు. రెండు సీజన్లలో 26 వికెట్లు తీసుకున్నాడు. గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్‌తో ట్రేడ్ అయ్యాడు. IPL 2025 వేలానికి ముందు , అతను రాయల్స్ చేత విడుదల అయ్యాడు. అతని బేస్ ధర రూ. 2 కోట్లతో ఈ ఏడాది వేలంలోకి రానున్నాడు.
ఇవి కూడా చదవండి
ఐపిఎల్‌లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ల జాబితాను ఓసారి చూద్దాం..
ఆటగాడు | జట్టు | ధర (రూ. కోట్లలో) | సంవత్సరం |
అవేష్ ఖాన్ | లక్నో సూపర్ జెయింట్స్ | 10.00 | 2022 |
కృష్ణప్ప గౌతం | చెన్నై సూపర్ కింగ్స్ | 9.25 | 2021 |
షారుక్ ఖాన్ | పంజాబ్ కింగ్స్ | 9.00 | 2022 |
రాహుల్ తెవాటియా | గుజరాత్ టైటాన్స్ | 9.00 | 2022 |
కృనాల్ పాండ్యా | ముంబై ఇండియన్స్ | 8.80 | 2018 |
వరుణ్ చక్రవర్తి | పంజాబ్ కింగ్స్ | 8.40 | 2019 |
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.