IPL 2025: ధనాధన్ లీగ్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి విజయ్.. ఎన్ని లక్షలంటే?

1 hour ago 1

శ్రీకాకుళం జిల్లా అంటే వెనుకబడిన జిల్లాగా… వలసల జిల్లాగా…పేరుంది. అలాంటి జిల్లా నుంచి మట్టిలో మాణిక్యoలా నిలిచాడు సిక్కోలు జిల్లాకు చెందిన త్రిపురాన విజయ్. కనీసం క్రికెట్ స్టేడియం కూడా లేని జిల్లా నుండి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సెలెక్ట్ అయ్యాడు. సోమవారం రాత్రి జరిగిన IPL ఆక్షన్ లో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణానికి చెందిన విజయ్ ను ఢిల్లీ కేపిటల్స్ రూ.30 లక్షలకు కొనుగోలకు చేసింది.ఇది జిల్లా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విజయంగా సిక్కోలు జిల్లా క్రీడాభిమానులు కీర్తిస్తున్నారు. 23 ఏళ్ల వయసున్న విజయ్ ది ఓ సాధారణ కుటుంభం. తండ్రి కృష్ణo రాజు పార్వతీపురం మన్యం జిల్లాలో I&PR డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణిగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రస్తుతం విజయ్ ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ 1st ఇయర్ చదువుతున్నాడు. విజయ్ కి అన్నయ్య వినోద్ ఉన్నారు. తమ కుమారుడు IPL ఆడుతున్నందుకు విజయ్ తల్లిదండ్రులు పుత్రోత్సాహoతో పొంగిపోతున్నారు. కష్టపడే తత్వం, క్రికెట్ పట్ల ఆసక్తి, పట్టుదల, విశేష సాధన ఈరోజు విజయ్ ని ఈస్తాయికి తీసుకువచ్చాయి అనటంలో సందేహం లేదు. చిన్నప్పటి నుండి ఇతనికి క్రికెట్ అంటే మక్కువ. అండర్ 14,16,19 లతో పాటు రంజీ లో మంచి ప్రతిభ కనబరిచాడు. క్రికెట్ లో రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ గా రాణిస్తున్న ఈ సిక్కోలు యువకుడు ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నాడు.బౌలింగ్ లో ఇతనిది రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ స్టైల్. క్రికెట్ లో విశేష ప్రతిభ కనబరుస్తూ ఎన్నో మెడల్స్ ను,పతకాలను సాధించాడు. అతని ఇంట్లో అడుగుపెడుతూ ఏ అలమరా చూసిన అతను సాధించిన అవార్డులు, పతకాలు కనిపిస్తూ మనల్ని పలకరిస్తాయి. త్రిపురాన విజయ్ సక్సెస్ వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు జిల్లా క్రికెట్ సంఘం, కోచ్లు, మెంటార్లు ఇచ్చిన శిక్షణ,చేసిన కృషి ఎంతో ఉంది.

ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న ఐ.పీ.ఎల్ . లో విజయ్ ఆడుతున్నాడని తెలిసి అతని బందువులు, స్నేహితులు,శ్రీకాకుళం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నియోజకవర్గం అయిన టెక్కలికి చెందిన క్రీడాకారుడు ఐపీఎల్ లో ఆడుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవశాయ,మత్స్య శాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుడు హైదరాబాద్ లో ఉన్న విజయ్ కి స్వయoగా ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు IPL లో ఆడుతుంటే అందులో శ్రీకాకుళం జిల్లాకి చెందిన యువకుడు స్థానం పొందినందుకు జిల్లా వాసులు గర్వపడుతున్నారు. క్రీడారంగంలో ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి చెందిన కోడి రామ్మూర్తి, వెయిట్ లిఫ్టర్ కరణo మల్లీశ్వరి లాంటి వారు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెగా ఇప్పుడు త్రిపురాన విజయ్ కూడా అదే కోవలో పయనిస్తున్నందుకు సంతోషిస్తున్నారు.

కుమారుడి సక్సెస్ గురించి తల్లిదండ్రుల మాటల్లో.. వీడియో

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article