iQOO Neo 10 Series: ఐక్యూ నుంచి స్టన్నింగ్ ఫోన్‌ వచ్చేస్తోంది.. 29న లాంచింగ్‌..

1 hour ago 1

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఐక్యూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఐక్యూ తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్‌ అవుతోన్న తరుణంలో. తాజాగా ఫోన్‌ లాంచింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఐక్యూ నియో 10 సిరీస్‌ ఫోన్‌ను నవంబర్‌ 29వ తేదీన మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన నెట్టింట వైరల్‌ అవుతోన్న కొన్ని ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 1.5 కే రిజల్యూషన్‌, 144 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. గేమింగ అనుభవం కోసం ఇందులో క్యూ2 చిప్‌ను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 61000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో కస్టమైజ్‌డ్ OISని అందిస్తున్నారు. దీంతో ఫొటోలు బ్లర్‌ కాకుండా ఉంటాయి. రెక్టాంగులర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వన్నారు. పంచ్‌ హోల్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌ను ర్యాలీ ఆరెంజ్‌, షాడో బ్లాక్‌, వైట్‌ కలర్స్‌లో తీసుకురానున్నారు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించనున్నారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 29వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article