తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయిందని చెబుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా వచ్చే ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, కూలీ సినిమా షూటింగ్ విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో శరవేగంగా జరుగుతుంది జరుగుతోంది.
ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు. టాలీవుడ్ హీరో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్రన్, నటి శ్రుతి హాసన్ సహా అనేక మంది సినీ ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా రానుందని తెలుస్తుంది. లోకేష్ దర్శకత్వంలో ఖైదీ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఖైదీ చిత్రం 2019 లో విడుదలైంది, కార్తీ ప్రధాన పాత్రలో నటించారు. ఇది దర్శకుడు లోకేష్ కు LCUలో నిర్మించిన మొదటి సినిమా కావడం గమనార్హం. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఖైదీ 2 సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. LCUలో భాగంగా కమల్ ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కూలీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఖైదీ 2షూటింగ్ మొదలుకానుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాతో పాటు బెంజ్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు లోకేష్. బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా LCU కలెక్షన్స్ లో చేర్చబోతున్నాడు లోకేష్.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి