సంక్రాంతి పండుగ అంటేనే బోలెడన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తారు. పిల్లలకు నచ్చేలా స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. అందులోనూ హెల్దీగా ఉండాలి అనుకుంటారు. అలాంటి వారు గోధుమ పిండితో ఈ కారప్పూస తయారు చేయండి. సాధారణంగా చనగ పిండితో కారప్పూస తయారు చేస్తారు. చనగ పిండి ఎక్కువగా తినకూడదు కాబట్టి.. గోధుమ పిండితో కూడా వేయవచ్చు. గోధుమ పిండితో చేసినా చాలా రుచిగా ఉంటాయి. వీటిని బాక్సుల్లో పిల్లలకు స్నాక్స్ పెట్టవచ్చు. మరి ఈ గోధుమ పిండితో కారప్పూస ఎలా తయారు చేస్తారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోధుమ పిండి కారప్పూసకు కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ఆయిల్.
గోధుమ పిండి కారప్పూస తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో నీళ్లు వేసి వేడి చేయండి. చిన్న మంట పెట్టండి. పైన ఓ స్టెయినర్ పెట్టండి. అందులో ఒక క్లాత్ వేయండి. ఆ క్లాత్‌పై మీరు తీసుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి వేయండి. ఆ తర్వాత క్లాత్ కప్పేసి ఓ పది నిమిషాలు ఆవిరి మీద పిండిని ఉడికించండి. ఇప్పుడు ఆ గిన్నెలోని పిండిని తీసేసి.. ఖాళీగా ఉండే లోతైన గిన్నె తీసుకోండి. ఒకసారి ఆ పిండిని చేతితో నలిపి.. ఆ తర్వాత జల్లెడ పట్టండి. జల్లెడ పట్టిన పిండిలో ఉప్పు, కారం, ఓ రెండు స్పూన్ల ఆయిల్ వేసి అంతా కలపండి. కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచి వేడి చేయండి. పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. ఆ తర్వాత కారప్పూస వేసుకునే చక్రంలో పిండిని ఉంచి.. ఆయిల్‌లో తిప్పండి. మంటని మీడియం మంటపై ఉంచండి. రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకోండి. అంతే ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి కారప్పూస సిద్దం.