KGF Movie: కేజీఎఫ్ 2లో నటించిన ఈ నటి భర్త టాలీవుడ్‏లో పవర్ ఫుల్ విలన్.. తెలుగులో చాలా ఫేమస్..

2 hours ago 1

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా కేజీఎఫ్. దాదాపు ఆరేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా థియేటర్లలో అదరగొట్టింది. ఈ ఒక్క సినిమా కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పటివరకు తెలుగు, హిందీలోనే ఉన్న పాన్ ఇండియా ట్రెండ్‏ను కన్నడలో సెన్సెషన్ అయ్యేలా చేసింది. అప్పటివరకు కన్నడ చిత్రాలపై ఉన్న అభిప్రాయాన్ని ఈ చిత్రం ఒక్కసారిగా మార్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోగా యష్ కెరీర్ కూడా మలుపు తిప్పింది. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. ఇక ఇటీవలే ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకువచ్చాడు ప్రశాంత్ నీల్.

కేజీఎఫ్ 2 మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో రిపోర్టర్, 24/ న్యూస్ చీఫ్ ఎడిటర్ గా కనిపించింది మాళవిక అవినాష్. ఇందులో ఆమె పాత్ర కూడా బాగానే హైలెట్ అయ్యింది. అసలు కథను ముందుకు నడపడంలో ఆమె పాత్ర మరింత ఫేమస్ అయ్యింది. మాళవిక అవినాష్ తమిళంలో చాలా పాపులర్ నటి. అలాగే కన్నడలోనూ అప్పట్లో సినిమాలు చేసింది. అయితే ఆమె భర్త మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్.

ఆమె భర్త తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. అతడు మరెవరో కాదండి నటుడు అవినాష్. రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో సిద్ధాంతి పాత్రలో నటించారు. అలాగే వెంకటేశ్ నటించిన నాగవళ్లి.. రవితేజ్ నటించిన దరువు, డమరుకం, రాజుగారి గది, అఖండ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article