జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. తన పంచులు, ప్రాసలతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే కొన్ని సినిమాల్లోనూ నటించి సినీ అభిమానులను అలరించాడు. అయితే గత కొన్నేళ్లుగా యాక్టింగ్ కు పూర్తిగా దూరంగా ఉంటున్నాడీ స్టార్ కమెడియన్. టీవీషోలు, సినిమాలను కంప్లీట్ గా పక్కన పెట్టి కేవలం బిజినెస్ పైనే దృష్టి సారించాడు. నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు సెంటర్ పేరుతో హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాల్లో బ్రాంచ్ లు ఏర్పాు చేశాడు. ప్రారంభంలో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన క్రమంగా ఆర్పీ చేపల పులుసు సెంటర్లపై విమర్శలు మొదలయ్యాయి. ధరలు మరీ ఎక్కవగా ఉన్నాయంటూ కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. అయితే తన క్వాలిటీ, క్వాంటీటీకి తగ్గట్టుగానే ధరలు ఉన్నాయని, ఇష్టమున్న వాళ్లు తినొచ్చని, లేకుంటే లైట్ తీసుకోవచ్చంటూ ట్రోల్స్‌ను తిప్పికొట్టాడు. ఇక గత కొంత కాలంగా రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు కిర్రాక్ ఆర్పీ. వైఎస్సారీసీపీ నాయకులపై సంచలన కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే… ఇప్పుడు మరో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు స్టార్ కమెడియన్. త్వరలోనే మణికొండలో ఏకంగా రూ. 2 కోట్లతో రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్పీనే స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు.
‘ మంచి ప్లానింగ్, మంచి ఆర్చిటెక్చర్ తో మణికొండలో రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాను. దీనికి సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యాయి. నెక్ట్స్ మంత్ ఎండింగ్ కల్లా రెస్టారెంట్ ప్రారంభమవుతుంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో ఏదో భరించానో, ఏదైతో భయపడ్డానో, ఏదైతే తెలుసుకోలేకపోయానో, ఏదైతో ఇబ్బంది పడ్డానో, ఏదైతో సడెన్ గా జరిగిందో.. వాటన్నిటినీ కూడా రిమూవ్ చేసుకుని, తప్పొప్పులను బేరీజు వేసుకుని, మరింత పకడ్బందీ ప్రణాళికతో ఈ సారి రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాను’ అని కిర్రాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
భార్యతో కిర్రాక్ ఆర్పీ..
బ్రహ్మానందంతో కిర్రాక్ ఆర్పీ దంపతులు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.