Kishan Reddy: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కేజ్రీవాల్ ప్రశ్నలపై స్పందించిన మంత్రి కిషన్‌రెడ్డి

2 hours ago 2

జైలు నుంచి బెయిలుపై విడుదలైన అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్‌కు ఐదు సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘జనతా కీ అదాలత్’ కార్యక్రమాన్ని కేజ్రీవాల్ ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ ఆ పార్టీ విధానాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. పార్టీలను చీల్చేందుకు సెంట్రల్ ఏజెన్సీలను ఉసిగొల్పడం, విపక్ష ప్రభుత్వాలను కుప్పకూల్చడం, అవినీతి నేతలను పార్టీలోకి తీసుకోవడాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా? అంటూ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. అరవింద్‌ సంధించిన ప్రశ్నలపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్పందించారు.

జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ భారత వ్యతిరేక ఆలోచనా ధోరణి తెరపైకి వస్తోందని అన్నారు. జమ్మూలోని త్రికూట నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ భారత వ్యతిరేక వైఖరి ప్రస్తావనకు వస్తోందని, ఇటీవల రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి తన మ్యానిఫెస్టోలో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుందని వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ఇటీవల వర్తింపజేసిన భూసేకరణ సమయంలో రైతులకు న్యాయమైన పరిహారం పొందే హక్కు, పిల్లల చదువులకు హామీ ఇచ్చే విద్యా హక్కు వంటి చట్టాలను ఇప్పుడు రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

A erstwhile Chief Minister

👉 who is the paragon of shamelessness 👉 who went to jailhouse aft getting caught red-handed successful a multi-crore liquor scam 👉 who did not attraction for families and their well-being 👉 who wanted to marque wealth illegally connected a delicate contented that causes strain… pic.twitter.com/X5SGLkvKnI

— G Kishan Reddy (@kishanreddybjp) September 22, 2024

జమ్మూ, కాశ్మీర్‌లో వర్తించిన 890 యూనియన్ చట్టాలను ఇది తిప్పికొడుతుందన్నారు. ఫలితంగా, పిల్లల విద్యకు హామీ ఇచ్చే విద్యా హక్కు, భూసేకరణ సమయంలో రైతులకు న్యాయమైన పరిహారం పొందే హక్కు వంటి చట్టాలను ఇప్పుడు రద్దు చేస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, దాని కూటమి భాగస్వామి నేషనల్ కాన్ఫరెన్స్ ఈ భారత వ్యతిరేక వైఖరికి మూల్యం చెల్లించాలని, ఎందుకంటే ఓటర్లు వారికి గుణపాఠం చెబుతారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article