చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో దాదాపు 78 బిలియన్ యూరోలు విలువైన ఒక ముఖ్యమైన బంగారు గనిని గుర్తించారు. ఈ గనిలో సుమారు 1,000 టన్నుల బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే చైనా బంగారు పరిశ్రమతో ప్రపంచ మైనింగ్ రంగం ఓ మైలు రాయిగా మారుతుంది. చైనాలోని వాంగులో బయటపడిన ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు.
హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో వాంగు బంగారు క్షేత్రంలో 40 కి పైగా గోల్డ్ వెయిన్స్‌ను గుర్తించింది. ఇవి భూ ఉపరితలం కింద దాదాపు 2,000 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ వెయిన్స్‌లో ఈ లోతులో దాదాపు 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉంటుందని అంచనా. అయితే, 3,000 మీటర్లకు చేరుకునే వరకు తవ్వకాలు జరపడం వల్ల అదనపు ఆశాజనకమైన నిల్వలు బయటపడ్డాయి. అందువల్ల మొత్తం నిల్వలు 1,000 మెట్రిక్ టన్నులను మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి నిల్వ భౌగోళిక అన్వేషణలో అసాధారణ సంఘటన అని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని నమూనాల్లో మెట్రిక్ టన్ను ధాతువుకు 138 గ్రాముల వరకు బంగారం ఉంటుంది.
ఈ స్థాయి నిల్వ సాధ్యమైతే హునాన్ ప్రావిన్స్ ప్రపంచ బంగారు మార్కెట్లో ప్రధాన పాత్రధారిగా ఎదగవచ్చు . ఈ ఆవిష్కరణకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు మైనింగ్ కార్యకలాపాలకు మించి విస్తరించి ఉన్నాయి మైనింగ్, శుద్ధి, రవాణా, అనుబంధ పరిశ్రమలలో వేలాది కొత్త ఉద్యోగాల సృష్టి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున వెలికితీతకు మద్దతుగా మెరుగైన రోడ్లు, రైలు నెట్‌వర్క్‌లు, ఇంధన సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పెరగనున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో వాంగు గోల్డ్ ఫీల్డ్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బంగారు నిక్షేపాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ గని వంటి ముఖ్యమైన నిల్వలను అధిగమించింది. ఇది దాదాపు 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..