అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని సినీనటి, బీజేపీ నేత మాధవీలత సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. అవమానం, వేధింపులతోపాటు, ప్రాణభయం కలిగించే చర్యలకు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని అనుచరులు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
“నేను 31 డిసెంబర్ 2024 న భద్రతా కారణాల దృష్ట్యా తాడిపత్రిలోని మహిళలు నూతన సంవత్సర వేడుకల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక వీడియో చేశాను. దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి 2025 జనవరి 1న బహిరంగంగా నా పరువు తీశారు. మా అసోసియేషన్లో కూడా ఫిర్యాదు చేశాను. వారు సైతం నాకు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా సపోర్టుగా ఉంటాం అన్న హామీ ఇచ్చారు. సంక్రాంతి కారణంగా కొంచెం ఆలస్యంగా సైబరాబాద్ సీపీకి కంప్లైంట్ చేశాను. నానా రకాల బూతులు మాట్లాడి ఇప్పుడు క్షమాపణ చెప్పాను.. అంటే సరిపోతుందా..? దానికి నేను నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాము. ప్రజలను సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులు ఇలాంటి బూతు మాటలు మాట్లాడితే ఎలా.. ? దీనిని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. నాకోసం నేను ఫైట్ చేయాలి దానితోపాటు అమ్మాయిల కోసం కూడా పోరాటం చేయాలి. నాకు చాలా మంది ఫోన్ చేసి అతను చాలా డేంజర్ అని చెప్పారు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూడా చెప్పారు. డేంజర్ అని నేను భయపడితే రేపు అమ్మయిల పరిస్థితి ఏంటి.. ? ఖచ్చితంగా నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మీద న్యాయపరంగా పోరాటం చేస్తాను. ఈరోజు సైబరాబాద్ సీపీకి జెసి ప్రభాకర్ రెడ్డి మీద రెండు కంప్లైంట్లు ఇచ్చాము” అని అన్నారు మాధవీలత.
“నాకు జెసి దివాకర్ రెడ్డితో ప్రాణ హాని ఉందని నేను కంప్లైంట్ చేశాను.. నాతో పాటు రాష్ట్రీయ యువ హిందు వాహిని నేషనల్ వైస్ ప్రెసిడెంట్ స్మిత గాంధీ కూడా సిపికి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ చేస్తాము. నాకు నా పార్టీ తరఫునుంచి కూడా సపోర్ట్ ఉంది ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడతాను. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసు మాత్రం వాపస్ తీసుకునే పరిస్థితి లేదు. ఆయన మాటల వల్ల నేను నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడ్డాము. అనంతపురంలో జేసీ రాజ్యాంగం నడుస్తోందా అన్నట్లుగా ఉంది” అని అన్నారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..