తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ సహా అనేక భాషల సినిమాల్లో నటించి మెప్పించిన మమతా కులకర్ణి ఇటీవల మహా కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. అంతేకాదు ఆమెకు కిన్నెర్ అఖాడా మహామండలేశ్వర్ పదవి కూడా లభించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆమెను మహామండలేశ్వర్ పదవి నుండి తొలగించారు. ఇప్పుడు మమతా కులకర్ణి స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంది. ఈ మేరకు ఆమె ఒక ఒక వీడియో ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ‘నేను ఇప్పుడు మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా సాధ్విగానే ఉన్నాను. ఇకపైనా సాధ్విగానే ఉంటాను’ అని మమతా కులకర్ణి వెల్లడించింది.
జనవరి 24న జరిగిన మహాకుంభమేళాలో కిన్నెర్ అఖాడా మహామండలేశ్వరి గా మమతా కులకర్ణి నియమితులయ్యారు. అయితే యోగా గురువు బాబా రాందేవ్ తో సహా పలువురు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. మమతా కులకర్ణికి మహామండలేశ్వరి పదవి ఇవ్వడంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నెర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో మమతా కులకర్ణి రాజీనామా చేయక తప్పలేదు.
ఇవి కూడా చదవండి
వీడియో ఇదిగో..
#WATCH | Prayagraj | Mamta Kulkarni says, “I americium resigning from the station of Mahamandaleshwar of Kinnar Akhada. I person been ‘sadhvi’ since my puerility and I’ll proceed to beryllium so…”
(Source – Mamta Kulkarni) pic.twitter.com/iQAmmBkjVR
— ANI (@ANI) February 10, 2025
నేను బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి 25 ఏళ్లు అయింది. నేను అన్నింటికీ దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను చేసే ప్రతి పనిని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మహామండలేశ్వరుడిగా నా నియామకంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు’ అని మమతా కులకర్ణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
డబ్బులు తీసుకుని ఇచ్చాను’ అని మమత చెప్పుకొచ్చింది.
మహా మండలేశ్వరిగా మమతా కులకర్ణిని తొలగిస్తూ ఆదేశాలు..
Rishi Ajay Das, laminitis of Kinnar Akhara, expels Mamta Kulkarni from the Akhara. He has besides expelled Mahamandaleshwar Laxminarayan Tripathi from the Kinnar Akhara for inducting Mamta Kulkarni, who is accused of treason, to the Akhara and designating her arsenic Mahamandaleshwar… pic.twitter.com/Hhzezst49r
— ANI (@ANI) January 31, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి