మహా కుంభమేళాలో 9వ రోజుకు చేరింది.. ఇప్పటి వరకు గంగానదిలో పవిత్ర స్నానాలు చేసిన వారి సంఖ్య తొమ్మిది కోట్లు దాటింది. మౌని అమావాస్య నాడు జరిగే ప్రధాన అమృత స్నాన మహోత్సవం సందర్బంగా మహాకుంభానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలోనే తాజాగా అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మహా కుంభమేళాకు వెళ్లారు. అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గౌతమ్ అదానీ జనవరి 21న ఉదయమే ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అక్కడ్నుంచి నేరుగా ఇస్కాన్ టెంపుల్‌ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ క్యాంపులో అదానీ తనవంతు సేవలు అందించారు. ఇస్కాన్ టెంపుల్ వారితో కలిసి ప్రసాదం తయారీ సేవలో పాల్గొన్నారు అదానీ. గౌతమ్ అదానీ ప్రసాద తయారీ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అదానీ గ్రూప్ సహకారంతో ఇస్కాన్ ఆధ్వర్యంలో కుంభమేళ యాత్రీకులకు మహాప్రసాదం పంపిణీ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani performs ‘seva’ astatine the campy of ISKCON Temple astatine #MahaKumbhMela2025
The Adani Group and ISKCON person joined hands to service meals to devotees astatine the Maha Kumbh Mela successful Prayagraj. The Mahaprasad Seva is being… pic.twitter.com/N1a1qGtS0b
— ANI (@ANI) January 21, 2025
గౌతమ్ అదానీతో పాటు ఆయన కుటుంబం కూడా మహాకుంభ్‌లో పాల్గొన్నారు. గౌతమ్ అదానీ కుటుంబం కూడా ఇస్కాన్ కిచెన్‌లో ప్రసాదం తయారీలో కూడా సహాయం చేశారు. అనంతరం గౌతమ్ అదానీ వీఐపీ బోట్‌లో సంగంలో పర్యటించి, బడే హనుమాన్ ఆలయంలో దర్శనం, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాకుంభానికి వచ్చే భక్తుల కోసం అదానీ గ్రూప్ బ్యాటరీతో నడిచే గ్రీన్ గోల్ఫ్ కార్ట్ సేవలను ప్రారంభించింది. ఈ సేవ కుంభమేళా సైట్‌లోని సెక్టార్ 19లో స్థాపించబడిన ఇస్కాన్ కేంద్రానికి సమీపంలో అందుబాటులో ఉంది. భక్తులను వారి నిర్దేశిత ప్రదేశాలకు చేర్చేందుకు ఈ రైలు ఉదయం 6 గంటల నుండి అర్థరాత్రి వరకు పనిచేస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..