భారతదేశ ఆటో రంగం బలమైన వృద్ధి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా స్థిరంగా ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఆటోమోటివ్ కంపెనీలకు స్థానికంగా మరిన్ని వాహనాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఈవీలతో తయారీతో పాటు సహా ఎగుమతి వాల్యూమ్‌లను కూడా పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్‌పో మొత్తం మొబిలిటీ వాల్యూ చైన్‌ను ఒకే దగ్గర ఏకం చేయడం, మొబిలిటీ భవిష్యత్తుకు వేదికను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ ఆటోమొబైల్ రంగం గత నాలుగు సంవత్సరాలలో 36 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. అలాగే రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
దేశ రాజధానిలో జరుగుతున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025’లో పలువురు నిపుణులు మాట్లాడుతూ దేశంలోని ఉత్పాదక జీడీపీలో ఆటో రంగం దాదాపు 50 శాతం దోహదపడుతుందని అంచనా వేస్తున్నట్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఆటో రంగ భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వాహనాలను ఇదే సరైన సమయంగా ఆటోమొబైల్ కంపెనీలు చూస్తున్నాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వ విధానాలు దీనికి చాలా సహాయకారిగా ఉంటున్నాయని చెబుతున్నారు.
ప్రస్తుతంం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో ఎంజీ కంపెనీ అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా ఎంజీ కంపెనీ జెడ్ఎస్ ఈవీ తయారీను జనవరి 2020లో ప్రారంభించింది. ఈ కంపెనీ శాతం కేవలం ఈవీ విభాగంలోనే ఉన్నాయి. అలాగే కియా కంపెనీ కూడా వీలైనంత ఎక్కువ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సంవత్సరం భారతదేశంలో తయారు చేసిన ఈవీను విడుదల చేస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి